welcome 2022
-
కొత్త సంవత్సరం ఈ రెజల్యూషన్స్ తీసుకుందామా?
కొత్త సంవత్సరం అనగానే చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఈ ఏడాదినుంచైనా తప్పక అమలుపరచాలనుకుంటారు. ఇలా నిర్ణయాలు తీసుకుంటూ, తప్పుతూ ఉండటం సహజం. కానీ కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠాల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. సరికొత్త ఏడాది 2022 సందర్భంగా ఈ తీర్మానాలు అమలు చేద్దాం. తు.చ. తప్పకుండా ఆచరిద్దాం. కరోనా మనకు మాస్క్ పెట్టుకోవడం నేర్పింది. కోవిడ్ నేపథ్యంలో స్వచ్ఛందంగా అమలు చేసుకున్న ఈ నిర్ణయం మరెన్నో శ్వాసకోస వ్యాధుల్నీ నివారించింది. ఈ విషయాన్ని డాక్టర్లు, పల్మనాలజిస్టులే నిర్ధారణ చేశారు. ఈ మంచి అలవాటును కోవిడ్ పూర్తిగా తగ్గేవరకే కాదు... ఆ తర్వాత కూడా అమలు చేయండి. మరీముఖ్యంగా సమూహాల్లోకి వెళ్లేటప్పుడు. గతంలో డాక్టర్లు మాత్రమే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ వాడేవారు. కోవిడ్ సందర్భంగా మనందరమూ దాన్ని వాడటం మొదలుపెట్టాం. ఈ శానిటైజర్ కేవలం కరోనానే కాదు... చాలా రకాల వ్యాధికారక క్రిములను నిర్మూలిస్తుంది. అందుకే మహమ్మారి సమయంలోనే కాదు... ఆ తర్వాత కూడా మన మెడికల్ కిట్‌లో శానిటైజర్ ఉండేలా చూసుకోండి. ఏదైనా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు చాలామంది మరీ దగ్గరగా వచ్చి చెబుతుంటారు. ఎదుటివారికి అది ఇబ్బందిగా అనిపించవచ్చు. భౌతికదూరం అనే నిబంధన అలవాటైనందున ఇకపై కూడా గౌరవపూర్వకమైన దూరం పాటిస్తూనే సంభాషించండి. ఇది వ్యాధులను నివారించే పద్ధతి మాత్రమే కాదు... మంచి మర్యాద లక్షణం కూడా. ఈ కోవిడ్ సమయంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవడం కోసం మంచి సమతులాహారం, తాజా కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి తీసుకోవడం ఓ అలవాటుగా మారింది. ఇది అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ అలవాటును కొనసాగించండి. అలాగని ఖరీదైనవి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు అందుబాటు ధరల్లో ఉండే మేలైన ఆహారాలనే తీసుకోండి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలం, సానుకూల దృక్పథం రోగనిరోధక శక్తిని పెంచుతాయనీ... చాలామందిలో క్యాన్సర్ వంటి జబ్బులనూ తగ్గించాయని అనేకమార్లు చదివాం. ఆత్మవిశ్వాసాన్ని, పాజిటివ్ ఆలోచనలను పెంచుకోడానికి నిర్ణయం తీసుకోండి. మీరు పూర్తి ఆరోగ్యవంతులై... రక్తదానం చేసే అవకాశం ఉన్నవారైతే ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోమారు రక్తదానమో లేదా ప్లేట్లెట్స్ దానం చేస్తాననే సంకల్పం తీసుకోండి. ఇది మీకు మంచి ఫీల్‌గుడ్ భావన ఇవ్వడమే కాదు... మీ ఆరోగ్యానికీ దోహదపడుతుంది. ఆహారాలన్నీ తాజాగా ఉంటేనే ఎంతో మేలు. నిల్వ చేసిన పదార్థాలకు దూరంగా ఉండండి. ఫ్రిజ్జులో పెట్టిన వాటిల్లో 50% – 60% పోషకాలు నశిస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు తాజావే తీసుకోవాలనే నియమం పెట్టుకోండి. ఒక వయసు దాటాక ఒకసారి పూర్తి హెల్త్ చెకప్ చేయించుకుని, నిశ్చింతగా ఉండండి,. ఆ తర్వాత ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, లక్షణాలు కనిపిస్తూ ఉండి, డాక్టర్ సలహా ఇస్తే తప్ప... మాటిమాటికీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, బీఎమ్ఐ వంటివి చెక్ చేసుకోకండి. ఆ రీడింగ్స్‌లో కొద్దిపాటì తేడా కనిపించినా అది మరింత ఒత్తిడి పెంచి, మాటిమాటికీ తప్పుడు రీడింగ్స్ చూపుతుంది. అందుకే ఒకసారి వార్షిక పరీక్షల తర్వాత, మీరు ఆరోగ్యవంతులని నిర్ధారణ అయ్యాక... ఇక ఏడాది మధ్యలో మళ్లీ మళ్లీ సాధారణ వైద్యపరీక్షలు వద్దు. ఆహారం తీసుకునే ముందర సలాడ్స్/గ్రీన్‌సలాడ్స్ తీసుకోవాలని నిర్ణయించుకోండి. దీనివల్ల కడుపు త్వరగా నిండిపోతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదమూ ఉండదు. బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ఆరోగ్యకరమని గుర్తుంచుకోండి. కంటి నిండా నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. అయితే... మరీ ఎక్కువగా నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక. మరీ తక్కువగా నిద్రపోవడం గుండెకు హాని చేస్తుంది. మీ రోజువారీ పనులన్నీ ఎలాంటి అలసట లేకుండా చేసుకోగలుగుతున్నారంటే... మీ నిద్ర మీకు సరిపోతోందని అర్థం. వృత్తిపరంగా సాధ్యమైనవారు మధ్యాహ్నం పూట చిన్న పవర్‌న్యాప్ తీసుకున్నా మంచిదే. అయితే అది అరగంటకు మించకూడదు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలనే నిర్ణయం తీసుకోండి. దాని వల్ల మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. అది అన్ని కండరాలకూ బలం పెంచినట్టే గుండె కండరాలనూ బలోపేతం చేస్తుంది. అందువల్ల గుండెపోటు ముప్పు కూడా నివారితమవుతుంది. అయితే వ్యాయామం కూడా మితిమీరకూడదని, శ్రమ కలిగించేలా ఉండకూడదని గుర్తుంచుకోండి. మానసిక, శారీరక ఒత్తిడి మితిమీరితే కీడు చేస్తుంది. అయితే కొన్ని పనులు వేళకు జరగడానికి ఒత్తిడి కొంతమేర ఉపయోగపడుతుంది. దాన్ని ఆ మేరకే ఉండనివ్వండి. ఒకవేళ ఒత్తిడి మితిమీరుతున్నట్లు గ్రహిస్తే... వెంటనే టీమ్ వర్క్ ప్రాధాన్యాన్ని గుర్తెరగండి. దాంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా పనులను మంచి టీమ్ వర్క్‌తో సాధించేందుకు... ఆ సామర్థ్యం ఉన్నవారిని ఎంచుకుని సంసిద్ధంగా ఉంచుకోండి.అవసరమైనప్పుడు వారి సేవలను తీసుకోండి. కొన్ని రకాల పనుల్లో ఉండేవారు లేట్ నైట్ పార్టీలకు వృత్తిపరంగా హాజరు కావాల్సి ఉండవచ్చు. అలాంటి వారు ఓ టైమ్ నిర్ణయించుకుని, అంతకు మించి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకండి. ఇది సామాజికంగా, ఆరోగ్యపరంగా... రెండు విధాలా మంచిదే. పొగతాగడం పూర్తిగా మానేయండి. పొగాకును చుట్ట, బీడీ, సిగరెట్, తంబాకూ, గుట్కా, ఖైనీ, నశ్యం... ఇలా ఏ రూపంలో తీసుకుంటున్నా వాటిని పూర్తిగా మానేయండి. ఒకవేళ మానలేకపోతే... మీ నికొటిన్ వాంఛను భర్తీ చేసే చ్యూయింగ్‌గమ్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతో చాలా తేలిగ్గా ఈ దురలవాట్లను వదులుకోవచ్చు. తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. మీ రోజువారీ భోజనమూ మితంగా ఉండాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పకూడదు. రాత్రి భోజనం మరీ ఎక్కువగా తినకూడదు. ఆరోగ్య కారణాల వల్ల మీకు ఇష్టమైన పదార్థాలను ఎక్కువగా తినకూడదని డాక్టర్ చెప్పినా లేదా చాలా చాలా పరిమితంగానే తీసుకోవాల్సి వచ్చినా... ఆ పదార్థాలను పూర్తిగా మానేస్తామనే నిర్ణయం తీసుకోకండి. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలే విఫలమవుతాయి. దీనికి బదులు... ఒక నిర్ణీతమైన రోజును ఎంచుకుని, ఆనాడు పరిమితమైన మోతాదులో దాన్ని తీసుకుంటానంటూ మనసుకు సర్దిచెప్పుకోండి. పూర్తిగా మానేయలనే సంకల్పం వల్ల దానికి పూర్తిగా దూరమవుతామనే ఓ ఒత్తిడి కలుగుతుంది. దానికి బదులు ఫలానా రోజున దాన్ని ఆస్వాదిస్తామనే భరోసా మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడూ బిజీగా ఉండటమే కాదు... ఇన్‌డోర్స్‌లో పనిచేసేవారు ఈ ఏడాది నుంచి కనీసం అరగంట లేదా గంటసేపు ఆరుబయట పచ్చికలో... ఆకాశం కింద గడపాలని నిర్ణయం తీసుకోండి. ఇది మీకు తాజా శ్వాసనూ, విటమిన్–డిని అందించి, మీ ఆరోగ్యాన్ని మరింత బాగుచేస్తుంది. -
నిక్ జోనాస్‌కు ప్రియాంక రొమాంటిక్ విష్.. ఇంకొన్ని పంచుకోవాలని
Priyanka Chopra Gives New Year Kiss To Nick Jonas: ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతోంది. గత సంవత్సరం మధురు స్మృతులు, చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారంతా. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, శుభాకాంక్షలు తెలపడం వంటివి ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు విష్ చేస్తున్నారు. వీళ్లందరికన్నా భిన్నంగా రొమాంటిక్‌గా విష్ చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రియాంక విష్ చేస్తూ నిక్ జోనాస్‌ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు నిక్ జోనాస్. ప్రియాంక తనను ముద్దు పెట్టుకునే ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్లో నిక్ జోనాస్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కు 'మై ఫరెవర్ న్యూ ఇయర్ కిస్ (ఎప్పటికీ నా కొత్త సంవత్సరపు ముద్దు)' అని లవ్ సింబల్‌తో క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నిక్, ప్రియాంక అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లోని ఇలాంటి మరికొన్ని రొమాంటిక్ క్షణాలను తమతో పంచుకోవాలని కోరుతున్నారు. 2021లో ఈ జంట చాలా బిజీగా గడిపింది. ప్రియాంక, నిక్ జోనాస్ విడిపోతున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటికి ప్రియాంక చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) ఇదీ చదవండి: మళ్లీ ఆ పాత్ర చేయాలని ఉందన్న పాపులర్ హీరోయిన్.. అదేంటంటే ? -
అక్షయ్ కుమార్ పాజిటివ్ మంత్ర.. సూర్యుడికి శుభాకాంక్షలు
Akshay Kumar New Year Wishes To Sun By Chanting Gayatri Mantra: న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు విష్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. అందరిలా ప్రియమైన వారికి, అభిమానులకు శుభాకాంక్షలు చెప్పలేదు ఈ పృథ్వీరాజ్. ఉదయాన్నే అందరిని నిద్ర నుంచి మేల్కొలిపే సూర్యుడికి గాయత్రి మంత్రం జపిస్తూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపాడు అక్కీ. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు 54 ఏళ్ల అక్షయ్ కుమార్. 'నూతన సంవత్సరం. అదే నేను. నిద్ర లేచి నా పాత స్నేహితుడు సూర్యుడికి శుభాకాంక్షలు తెలిపాను. కరోనా కాకుండా మిగతా అన్ని అంశాలు పాజిటివ్‌గా ఉండేలా 2022 సంవత్సరాన్ని ప్రారంభించాను. అందరి ఆరోగ్యం, ఆనందం కోసం ప్రార్థిస్తున్నాను. హ్యాపీ న్యూయర్.' అని రాసిన క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేశాడు అక్కీ. ఈ పోస్టులో సూర్యుడికి ఎదురుగా నమస్కరిస్తూ గాయత్రి మంత్రాన్ని జపించాడు. అక్షయ్ కుమార్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, రామ్ సేతు, ఓ మై గాడ్! 2 చిత్రాలు ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
కడుపు నిండాలని ఓ పూట భోజనం పెడితే.. ఉన్న కొద్ది డబ్బుతో మద్యం
‘ఏదైనా ఒక విషయం లేదా ఒక ఆలోచన నిన్ను భౌతికం గా కానీ, మేధోపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ బలహీన పరుస్తుంటే తక్షణమే దానిని విషంగా భావించి దూరం పెట్టాలి’ అన్నారు స్వామి వివేకానంద. అలాగే ‘రోజుకు కనీసం ఒక్కసారైనా నీతో నీవు మాట్లాడుకో. అలా చేయని పక్షంలో ప్రపంచంలోని ఒక అద్భుతమైన వ్యక్తితో మమేకమయ్యే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నట్లే’ అని కూడా చెప్పారాయన. మరింత స్పష్టంగా... ‘నీ మీద నీకు విశ్వాసం లేనంత వరకు నువ్వు భగవంతుడిని కూడా విశ్వసించలేవ’ని కూడా చెప్పారు. ఇవన్నీ ఒత్తిడులను జయించమని, నీకు హాని కలిగించే ఆలోచనను విసర్జించగలిగిన పరిణతిని సాధించమని, జీవితాన్ని ఆనందమయం చేసుకోమని చెప్పడమే. కేరళలోని కొన్ని మారుమూల జిల్లాల్లో పిల్లలు పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితులను అరికట్టడానికి ప్రభుత్వం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి భోజనం పెడుతోంది. కనీసం ఒక పూట అయినా కడుపు నిండా భోజనానికి భరోసా ఉంటే ప్రాణాలను కాపాడవచ్చనుకున్నారు పాలకులు. ఇది ఇలా ఉంటే... ప్రజలు కమ్యూనిటీ కిచెన్‌లో భోజనం చేస్తూ తాము పని చేసి సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బును మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. రెండోపూట పస్తులుంటున్నారు. ఈ ఉదంతంతో ఏం తెలుస్తోంది? కష్టాలను కొనితెచ్చుకోవడం అనేది మనిషి స్వయంగా తనకు తానుగా చేసుకుంటున్నట్లు అనిపించడం లేదా? ఇందుకు వారి బలహీనమైన మానసిక స్థితి కూడా కారణం కావచ్చు. మనసు మీద ఆధిపత్యం సాధించగలిగితే జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. సంతోషంగా జీవించవచ్చా, విజయగర్వంతో జీవించవచ్చా అనేది తమకు తాముగానే నిర్ణయించుకోగలుగుతారు. తనతో తాను మాట్లాడుకోగలిగితే ఆ రోజు ఏమేం చేశాననే పునశ్చరణతో పరివర్తనకు బీజం పడుతుంది. ‘దేవుడా! నాకు అదివ్వు ఇదివ్వు’ అని అడగడానికి ముందు తమ మీద తాము విశ్వాసం ఉంచుకోవడం కూడా అవసరమేనన్నారు వివేకానంద. కొత్త సంవత్సరం తీర్మానాల్లో ‘ప్రతిరోజూ ఒకసారి మనతో మనం మాట్లాడుకుందాం. మనకు హాని కలిగించే విషయాన్ని రెండవ ఆలోచన లేకుండా దూరం పెడదాం, అది బయటి వస్తువు కావచ్చు లేదా మన మెదడులోనే ఉండవచ్చు. ఆ విషం మనలో ఉన్నదే అయినా సరే తక్షణం వదిలేద్దాం. అలాగే మన మీద మనం విశ్వాసాన్ని పెంచుకుందాం’. ఏడాదంతా క్షేమంగా జీవిద్దాం. చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల -
మంచి ఆలోచనలతో మెరుగైన ఆరోగ్యం
మన ఆలోచనలే మనం అని చెప్పుకోవడం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విశ్లేషణలా అనిపించవచ్చు కానీ అది నిజం. మన ఆలోచనలు బాగుంటే మానసికంగా బాగుంటాం. మానసిక ఆరోగ్యం సవ్యంగా ఉన్నప్పుడే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేడు మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను, అవి కలిగించిన ప్రతికూల భావనలను వదిలేసి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకుని, ప్రశాంతమైన జీవనం సాగించేందుకు కొత్త సంవత్సరం లో నిర్ణయం తీసుకుందాం... మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.. ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిని ఆధారంగా చేసుకుని వైద్య శాస్త్రంలోని వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు సైకో న్యూరో ఇమ్యునాలజీ అనే సరికొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనిషి చేసే సానుకూల ఆలోచనల ఫలితమే వారి ఆరోగ్యమని, ప్రతికూల ఆలోచనలే వారి అనారోగ్యమని ఈ విభాగం తెలియజేస్తోంది. మరి సానుకూల ఆలోచనలు ఎలా పెంపొందించుకోవాలో...అందుకు ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. చురుకైన మెదడు మెదడును ఉత్తేజంగా ఉండేలా చూసుకోవాలి. మెదడు చురుగ్గా ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫలితంగా మానసిక సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. అందుకోసం రోజూ కంటినిండా నిద్రపోవాలి. దాంతో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలు పోయి మెదడు చురుగ్గా మారుతుంది.మనం నిత్యం తీసుకునే ఆహారం కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కనుక రోజూ తగిన పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అటువంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారం ముఖ్యమైనది. వీటిని నిత్యం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మానసిక సమస్యలు పోతాయి.శారీరక వ్యాయామంతోపాటు రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడం, పద వినోదం, పజిల్స్ నింపడం, సుడోకు ఆడడం వంటి మెదడుకు మేత పెట్టే పనులు చేస్తే మంచిది. పాజిటివ్ ఆలోచనలు ఆరోగ్యానికి అండ సాటివారిపట్ల ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి గుణాలు కలిగున్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మనస్తత్వ శాస్త్రవేత్తలతోపాటు వైద్యులు కూడా చెబుతున్నారు. అలాగే .... సానుకూలమైన అనుభూతులతో ఉన్న మనిషిలో తెల్ల రక్తకణాలు వృద్ధి చెంది, వ్యాధికారక క్రిములను పెరగకుండా నిరోధిస్తాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కోపం, ద్వేషం, దుఃఖం, విచారం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు మనిషిని మానసికంగా ఒత్తిళ్లు, ఆందోళనలకు గురిచేసి తెల్ల రక్తకణాలను తగ్గిస్తాయి. ఫలితంగా మనిషి అనారోగ్యానికి గురవుతాడు. అందుకే మంచి ఆలోచనలు ఉంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఒంటరితనం వద్దు ఒంటరిగా ఉన్న మనిషిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువ. ఫలితంగా మనిషిలో తెల్ల రక్త కణాలు తక్కువవుతుంటాయి. ఎన్నో శారీరక సమస్యలు మొదలవుతాయి. ఆహార విహారాలపై అవగాహన లోపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. మనసు ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఆ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతూ అల్జీమర్స్ వంటి ఆరోగ్య సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒంటరిగా ఉన్నవారు ఏదో ఒక పనిలో నిమగ్నమైనప్పుడు మెదడు నిర్మాణాత్మకంగా పనిచేస్తూ, సానుకూల ఆలోచనలకు తెరలేపుతుందన్నది చికాగోలోని రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రజ్ఞుల సూచన.సానుకూల ఆలోచనల కోసం మెదడుకు తగు తర్ఫీదు ఇవ్వాలి. ►ఇతరులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దాలు మాత్రమే ఉపయోగించే అలవాటు చేసుకోవాలి.. ►ఎవరికి వారు సానుకూల స్వయం సలహాలు ఇచ్చుకుంటుండాలి. ►ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలు, చేతలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. ►ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ►తప్పులు జరిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ►వైఫల్యాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకుని, ప్రస్తుతం జరిగిన వాటిని విశ్లేషించుకోవాలి. ►విజయాల బాటలో నడిచిన వారిని చూసి అసూయ చెందకుండా వారి నుంచి ప్రేరణ పొందడం అలవాటు చేసుకోవాలి. ►ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు... వాటిని సానుకూలం గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. పెదవుల మీద చిరునవ్వు చెదరనీయకూడదు. ∙మంచి జరగబోతోందని ఊహించుకోవాలి. ►ఉట్టిపుణ్యానికి బద్ధకంతో పనులు వాయిదా వేసే అలవాటు మానుకోవాలి. ►సెల్ఫ్ రిలాక్సేషన్ పద్ధతి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ►ఇతరులతో ప్రేమగా వ్యవహరించడం.... నవ్వుతూ... నవ్విస్తూ ఉండడం వల్ల ఎంత పెద్ద జబ్బునైనా నయంచేసుకోవచ్చన్న నిపుణుల సలహాను పరిగణనలోకి తీసుకోవాలి. తీసుకునే ఆహారంతోనే ఆలోచనా విధానం ముడిపడి ఉందని అంటున్నారు నిపుణులు. తాజా పండ్లను, కూరగాయలను తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ప్రతికూల ఆలోచనలు వద్దు నెగెటివ్ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఎదుటివాళ్లకి మనమీద నమ్మకం లేకుండా చేస్తాయి. ఇలాంటి ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో కనుక్కోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన తపన ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ఫలితం ఉండదు. భవిష్యత్తు గురించి అసలు ఆలోచన చేయకుండా ఉండటం ఎంత తప్పో, భవిష్యత్తులో అలా జరుగుతుందేమో... ఇలా జరుగుతుందేమో అని అతిగా ఆలోచించడ కూడా అంతే తప్పు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది.ఎప్పుడైతే మనమీద మనకు నమ్మకం లేదో అప్పుడు ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి. అందువల్ల మనమీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన చేదు అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అలాంటప్పుడు గతాన్ని మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఏడాదంతా కాదు.. ఎప్పటికీ ఆరోగ్యం గా ఆనందంగా ఉండగలుగుతాం. ∙ -
కొత్త సంవత్సరం సంకల్పాలు..
365 విలువైన కాలపు సంచులతో కొత్త సంవత్సరం అతిథిగా వచ్చేసింది. ఆ సంచులలో ఏముంది? ఏ సంచిలో ఏ అనుభవం మనకై రిజర్వ్ అయి ఉంది. అంతుచిక్కనివ్వకపోవడమే కాల మహిమ. అదే జీవితానికి మధురిమ. చిన్నపిల్లలు కింద పడితే వారే లేచేంత వరకు పెద్దలు గమనిస్తూ ఉండిపోయినట్టు కాలం కూడా మనల్ని అనుభవాలతో చెక్కి రాటుదేలేలా చేస్తుంది. పరిణతి తెచ్చిపెడుతుంది. స్థితప్రజ్ఞతతో జీవితాన్ని ఎదుర్కొనడం నేర్పిస్తుంది. కొత్తకాలం ఎప్పుడూ ఆశతో ఉండు అని చెప్పడానికే వస్తుంది. కొత్త సంవత్సరం ఊపిరినిండా ఆకాంక్షలు నింపుకోవడానికే వచ్చింది. ఈ సంవత్సరం హ్యాపీగా గడిచేందుకు సంకల్పాలు సరిచేతలు కొన్ని.... తొలి వందనం కుటుంబానికి గేట్ తీస్తూ ఇంటి లోపలికి తండ్రి అడుగు పెడుతూ ఉండటం బాగుంటుంది. పిల్లల్ని హెచ్చరిస్తూ తల్లి ఇంటిని నిభాయించుకుంటూ రావడం బాగుంటుంది. ‘ఒరే అన్నయ్యా’... అని పిలిచే చెల్లి పిలుపు బాగుంటుంది. ‘తమ్ముడూ’... అని క్రికెట్ బ్యాట్ కొనిచ్చే అన్నయ్య ఉండటం బాగుంటుంది. ‘న్యూస్‌పేపర్ ఎక్కడా’ అని మనమడిని కేకేసే తాత ఉండటం బాగుంటుంది. పూలసజ్జ పట్టుకుని మొక్కల దగ్గర తిరుగాడే జేజి కనిపించడం బాగుంటుంది. సంఘంలో అందమైన కుటుంబం బాగుంటుంది. కుటుంబం కోసం అక్కర కలిగిన సంఘమూ బాగుంటుంది. కుటుంబానికి విలువివ్వని మనిషి సంఘానికి ఇవ్వడు. కుటుంబం పట్ల బాధ్యత లేని మనిషి సంఘం పట్ల బాధ్యత వహించడు. నీ కుటుంబాన్ని చూసి నువ్వు ఎలాంటివాడివో చెప్పొచ్చు. నీ కుటుంబ అనుబంధాలను బట్టి సంఘంతో నీ అనుబంధం బేరీజు వేయవచ్చు. తోడబుట్టిన వాళ్లతో తెగదెంపులు నేటి ఫ్యాషన్. మాట పట్టింపులతో రక్త సంబంధాల కోత నేటి ట్రెండ్. కొత్త సంవత్సరంలో కుటుంబమే ముఖ్యం అనుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించిన గత కాలాన్ని బిలంలో పడేద్దాము. వారితో ఆప్యాయంగా ఉందాం. పిల్లల పలకరింపు కోసం అలమటించే పెద్దల చెంప దెబ్బ తిందాము. కన్నీళ్లతో అభిషేకిద్దాము. వారి క్షమాపణ పొంది వారి సంతోషం కోసం ఇంటి వాకిలి తెరుద్దాము. కొత్త సంవత్సరంలో కుటుంబమే ముఖ్యం అనుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించిన గత కాలాన్ని బిలంలో పడేద్దాము. నిన్ను నువ్వు తెలుసుకో ఎంత ఎగిరినా భుజాలకు రెక్కలు మొలవవు. ఎంత రుద్దినా కాళ్లకు చక్రాలు పుట్టవు. ఏమి చేసినా అందరూ ఎనిమిది అడుగుల ఎత్తుకు ఎదగరు. ఊయలలో ఊగి మొదలెట్టే ప్రయాణంలో దొరికే సమయానికి ప్రపంచంలో ప్రతి అంగుళం చుట్టి రాలేము. మన మొదలు మన తుది మనకు తెలియాలి. పక్కన వాడి మొదలూ తుదితో పోటీ పడటమే నేటి సమస్య. మనకు బైక్ ఉండటం సంతోషం కావడం లేదు. పక్కవాడి కారును చూసి ఏడుపు ఎగదన్నుకొని వస్తోంది. మూస చదువులు నేటి యువతకు సమస్య. మూస ఉపాధి నేటి కుర్రకారుకు ఫ్రస్ట్రేషన్. మూస పోటీ వారికి అశాంతి. దేనిలో ఇష్టం ఉంది, ఏ పనిలో అభిరుచి ఉంది, కౌశలం ప్రావీణ్యం ఎందులో ప్రదర్శించవచ్చు ఇవి పట్టించుకోవడం లేదు. తెలుసుకున్నా పోటీ కొద్దీ వాటిని వదిలేసి తెలియని బావిలో దూకాల్సి వస్తోంది. ఉనికి, గుర్తింపు, అస్తిత్వం, గౌరవం.. చిన్న పనిలో అయినా పెద్ద పనిలో అయినా... ఇవీ సాధించవలసింది. అదే సంపద. యువత తానేమిటో తాను తెలుసుకోవాలి. అందుకు తల్లిదండ్రులు సహకరించాలి. ఆ మేరకు ఈ కొత్త సంవత్సరంలో కన్ను తెరవాలి. ఉనికి, గుర్తింపు, అస్తిత్వం, గౌరవం.. చిన్న పనిలో అయినా పెద్ద పనిలో అయినా... ఇవీ సాధించవలసింది. స్వస్థత ప్రధానం గతంలో కట్టివేయడానికి సంకెళ్లు, తాళ్లు బజారులో దొరికేవి. ఇప్పుడు చేతిలోనే వాటిని తలదన్నే వస్తువు ఉంది. సెల్‌ఫోన్. కదలికలు నిరోధించబడటం శిథిలానికి దగ్గర కావడం. వ్యాయామ సమయాలు తగ్గిపోతున్నాయా చూసుకోవాలి. నడవడం, ప్రతి ఉదయం లేదా సాయంత్రం కేవలం మనతో మనమే ఉండేలా నడవడం, మనం నడుస్తున్నట్టుగా శరీరానికి తెలిసేలా నడవడం అవసరం. సెల్‌ఫోన్ దీనిని నిరోధిస్తోంది. వ్యాపకాలు నిరోధిస్తున్నాయి. వినోద ఆకర్షణలు నిరోధిస్తున్నాయి. ఇంట్లో మోటివేషన్ లేకపోవడం నిరోధిస్తున్నది. కుటుంబ ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్. ఆరోగ్యానికి మనం ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నామో ఇకపై జాగ్రత్తగా గమనించుకోవాలి. సెల్‌ఫోన్ చూడటం వల్ల, విపరీతంగా వాడటం వల్ల, మెడ వంచి దానిలో నిమగ్నం కావడం వల్ల మున్ముందు కంటి సమస్యలు, చెవి సమస్యలు, మెడ సమస్యలు తప్పవు. వ్యాయామం చేయకపోతే స్థూలకాయం, అజీర్తి సమస్యలు తప్పవు. జంక్ ఫుడ్ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరగదు. హెల్దీ ఫుడ్ ఇంట్లో వండుకోవడం బద్దకం వేసి స్విగ్గీలకు జొమాటోలకు అలవాటు పడితే లోపలకు వెళ్లేది ప్రిస్క్రిప్షిన్ రూపంలో చేతికి వస్తుంది. మహమ్మారి ఇంకా ఇంకా భయపెడుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యమే ప్రధానం. అదే మన నినాదం. అందుకు నిపుణుల, వైద్యుల సలహా తో కచ్చితమైన అలవాట్లను పాటించాలనే నిర్ణయం ఈ సంవత్సరంలో తీసుకోక తప్పదు. తర్వాతి స్థానం ప్రేమది ప్రేమ అడుగంటిపోయిన నివాసం మహలు అయినా పాక అయినా ఒకటే. స్త్రీ, పురుషులు భార్యాభర్తలయ్యాక ఆ కాపురానికి తలం ప్రేమ కావాలి. ఛాయ ప్రేమ కావాలి. పంచుకున్న బతుకు ప్రేమ కావాలి. తమ మధ్య ప్రేమ నశించిపోయింది అని గుర్తించలేని స్థితిలో నేటి భార్యాభర్తలు ఉన్నారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ ప్రదర్శించుకోవాలి అని గ్రహింపు లేని భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరూ ఆఫీసులకు వెళ్లినా, అతను వెళ్లి ఆమె ఉన్నా, సాయంత్రాలు కలిసి టీవీ చూసినా, పిల్లల గురించి నాలుగు మాటలు మాట్లాడుకున్నా అదంతా మొక్కుబడి అని ఇరువురూ అనుకుంటే అంతకు మించిన దురదృష్టం మరొకటి లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే పిల్లలకు సక్రమంగా ప్రేమ ప్రవహించదు. పిల్లలకు ప్రేమ అందకపోతే భవిష్యత్తు సౌకర్యంగా ఉండదు. ప్రేమ పొందడం ఊరికే జరిగిపోదు. అందుకు శ్రద్ధ పెట్టాలి. జీవిత భాగస్వామి పట్ల గౌరవం ఉండాలి. జీవితాన్ని నిర్మించుకోవడానికి కలిశారు మీరిద్దరు. పైచేయి సాధించాలని కింద పడవద్దు. అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా అశాంతి తెచ్చుకోవద్దు. పాలలో చక్కెర కూడా కలబెడితేనే కరుగుతుంది. ప్రేమ ప్రదర్శిస్తేనే తెలుస్తుంది. ఈ సంవత్సరం ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని చెప్పగలిగే సందర్భాలు ఒక వేయి రావాలని భావించండి. దాంపత్య జీవితాన్ని సంతోషమయం చేసుకోండి. పౌరులం మనం పౌరులం మనం. నియమ నిబంధనలు పాటించే పౌరులే మెరుగైన పౌర సమాజం నిర్మిస్తారు. ప్రభుత్వం పౌర జీవనం కోసం ఎన్నో పనులు చేస్తుంటుంది. పౌరులుగా వాటిని గౌరవించాలి. మాస్క్ ధరించమంటే ధరించకుండా, హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోకుండా, తాగి డ్రైవ్ చేయవద్దంటే చేస్తూ, టీకా వేయించుకోమంటే వేయించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే సరైన పౌరులం అనిపించుకోము. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, హాళ్లు, మాళ్లు... వీటి నిర్మాణంలో ప్రమాణాలు పాటించడం కనీస పౌర ధర్మం. ఆక్రమణలు చేయకపోవడం, చెత్తను సరిగ్గా పారబోయడం, వాహనాలను ఇష్టం వచ్చినట్టుగా పార్క్ చేయకపోవడం... చేయాల్సింది. ఎంగిలి ఊయడం అసహ్యకరమైన పని అని తెలిసినా రోడ్డు మీద ఎంగిలి ఊస్తూ కనిపించే వారిని ఏమనాలి? ఓట్ల కాలం వస్తే డబ్బులు డిమాండ్ చేసే వారిని గెలిచిన అభ్యర్థి పౌరులుగా చూస్తాడా? గౌరవిస్తాడా? సమాజంలో ప్రతి పౌరుడు పౌర బాధ్యతలు నిర్వర్తిస్తూ గౌరవం పొందాలని ఈ సంవత్సరం అందుకు నాంది కావాలని కోరుకుందాం. ఏమిటి మన సంస్కారాలు? సంస్కారాల పరిణతి సమాజ పరిణతి ఒక్కటే. సంకుచితాల నుంచి బయట పడటమే సంస్కారం. ఛాందసాలు, మూఢ విశ్వాసాల నుంచి చెడు మాటలు, చేష్టలు, ఆలోచనల నుంచి బయట పడటమే సంస్కారం. ఎదుటి మనిషి కళ్లబడిన వెంటనే కులం, మతం, ప్రాంతం జ్ఞప్తికి రావడం నీచ సంస్కారం. ‘మనవాడికే’ మన మద్దతు రోత సంస్కారం. ఫలానా తిండి చెడ్డది, జీవన విధానం చెడ్డది, సమూహం చెడ్డది అని భావించి, నమ్మి, దానికి తోడు ప్రచారం చేసి, విద్వేషం నింపుకోవడం కుసంస్కారం. పరువు పేరుతో పిల్లలను కోల్పోయేంత పంతం పెంచుకోవడం దారుణ సంస్కారం. స్నేహం, సహనం, సహ జీవనం, ఆదరణ, సహాయం, సమాన దృష్టి... ఇవీ సంస్కార గుణాలంటే. మనిషిగా ఉండటం సంస్కారం. మనతో పాటు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో హక్కులు ఉన్నాయి, ఉంటాయి అనుకోవడం సంస్కారం. బతుకు.. బతికించు విధానం పాటించడం సంస్కారం. ఏ ఒక్క మనిషి కంటే, మతం కంటే, కులం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే, జెండర్ కంటే మరొకరు ఎక్కువ అని ఎవరైతే భావిస్తారో వారి సంస్కారం అథమంగా ఉన్నట్టు లెక్క. సంస్కార ప్రమాణాలు పెరిగేలా చేయమని ఈ సంవత్సరానికి విన్నవిద్దాం. సంఘటితం కావాలి సందర్భాలకు తగినట్టుగా సంఘటితం కాని ప్రజలు ఉన్న దేశం తిరోగమనంలో పడుతుంది. దేశం అంటే హితం. దేశం అంటే ప్రజాహితం. దేశం అంటే మట్టి. దేశం అంటే మొలక. దేశం అంటే అడవి. దేశం అంటే ఇంకా న్యాయం అందవలసిన ప్రజ. దేశం అంటే స్త్రీలు. దేశం అంటే ప్రజాస్వామిక విధానాలు అవలంబించాల్సిన పాలన. అటువంటి విధానాలకు విఘాతం కలిగినప్పుడు స్థానికం గా కాని, రాష్ట్రీయంగా కాని, జాతీయంగా కాని ప్రజలు సంఘటితం కాగలగాలి. శాంతియుత నిరసన తెలపాలి. సరి చేయించాలి. ‘మనకెందుకులే’ అనే ధోరణి చాలు. ‘నష్టం మనకు కాదు కదా’ అనుకోవడానికి వీల్లేదు. ఆమ్ల వర్షం ఫలానా వారిని ఎంచుకొని కురవదు. కార్చిచ్చు ఏ ఒక్కరినో దహించదు. ప్రజలే దేశ నిర్మాణకర్తలు. సంఘటితం కావడమే వారి అజేయమైన శక్తి. ప్రతి ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ప్రతి ఒక్కరూ తల ఎత్తేలా ఈ దేశం మేలుకోవాలి. అందుకు ఈ సంవత్సరం మార్గం చూపాలి. ప్రకృతితో బతకాలి ప్రకృతితో మనం బతుకుతున్నాం. మనతో ప్రకృతి బతకడం లేదు. నీలి రంగు, ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపించాల్సిన ఈ భూగోళంలో ఆ రంగులు ఏ మేరకు పలచబడుతున్నాయో గమనించుకోవాలి. సిమెంటు రంగు భూగోళం ఏర్పడకుండా చూడాలి. పక్షుల్ని వాలనివ్వాలి. మొక్కల్ని ఎదగనివ్వాలి. తీగలు కిటికీల వరకూ పాకి గదుల్లో తొంగి చూడగలగాలి. నదులు, కాలవలు తమ స్థలాలను తిరిగి ఆక్రమించుకునే హక్కును ఇవ్వగలగాలి. మట్టి, ఇసుక, కొండ, అడవి సురక్షితంగా ఉండాలి. మట్టి మీద నడిచే మనం కృతజ్ఞతగా దానికి మొక్కను ఇవ్వగలగాలి. ప్రతి సంవత్సరం పది మొక్కలు నాటాలి అనుకుంటే అంతకు మించిన సాయం లేదు భూమికి. నా వంతు కాలుష్యాన్ని నివారిస్తాను అనుకుంటే ప్రకృతి బతికి బట్టకడుతుంది. ఈ సంవత్సరం ప్రకృతి స్నేహితులుగా మారడానికి సంకల్పించుకుందాం. -
తగ్గేదేలే.. హ్యాపీహ్యాపీగా కొత్త ఏడాదిలోకి ఎంట్రీ.. (ఫోటోలు)
-
న్యూ ఇయర్ జోష్.. ఫ్యాన్స్ ఖుష్
గడచిన ఏడాది చివరి రోజు వచ్చిన సినిమాల కొత్త అప్డేట్స్తో సినీ లవర్స్‌లో న్యూ ఇయర్ జోష్ ఆరంభమైంది. ఆ అప్‌డేట్స్‌లోకి వస్తే...‘లాహే లాహే.., నీలాంబరి’ పాటల తర్వాత ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘సాన కష్టం..’ అనే మాస్ పాట లిరికల్ వీడియో ఈ నెల 3న విడుదల కానుంది. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఇటు ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రం టీజర్ నేడు రిలీజ్ అవుతోంది. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. అటు ‘భీమ్లా నాయక్’ కొత్త సౌండ్ వినిపించాడు. పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి ‘లాలా భీమ్లా’ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట డీజే వెర్షన్‌ను విడుదల చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘రామం రాఘవం’ మ్యూజిక్ వీడియో రిలీజైంది. రైజ్ ఆఫ్ రామ్‌గా వచ్చిన ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ మెరిశారు. ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది. అటు ‘అట్టా సూడకే..’ అంటూ మాసీ స్టెప్పులేశారు ‘ఖిలాడి’. రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖిలాడి’ నుంచి ‘అట్టా సూడకే’ పాట లిరికల్ వీడియో విడుదలైంది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. మరోవైపు çపూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలయింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపిస్తారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది. ఇంకోవైపు ‘మేజర్’ హిందీ వెర్షన్‌కి డబ్బింగ్ చెబుతున్నారు అడివి శేష్. వీరజవాన్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ పాత్ర చేశారు శేష్. ముంబై 26/11 దాడుల ఆధారంగా జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ఫ్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది. కొత్త ఏడాదికి తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు శ్రీ విష్ణు. వేదరాజ్ టింబర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం. ఓ విభిన్న కథాంశంతో సినిమా నిర్మించనున్నాం’’ అన్నారు వేదరాజ్. -
కొత్త సంవత్సరం వచ్చేసింది.. అయితే ఇలా చేయండి!
పాత భావాలు... పారేయము. అటక మీద పాత సరుకు.. పారేయము. పంచేయము. పాత బట్టలు, బూట్లు... పారేయము. పంచేయము. అవసరం లేని ఇంటిని ఆక్రమించిన చెడిపోయిన వస్తువులు? పారేయము. పంచేయము. కొత్తవి రావాలంటే పాతవి ఖాళీ చేయాలి. కొత్త సంవత్సరం వచ్చేసింది. పాతవి పారేయండి. లేదా అవసరం ఉన్నవారికి పంచేయండి.కొత్తకు దారివ్వండి. కొత్త సంవత్సరం వస్తుంటే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. దానికి ముందు పాతవి పారేయాలి కదా. పాతను తీసేయాలి కదా. అక్కరలేని పాతవి అక్కర ఉన్నవారికి కనీసం పంచేయాలి కదా. ఆ పని చేయము. కొత్త సంవత్సరానికి రెడీ కావడం అంటే కొత్తగా రెడీ కావడమే. కొత్త సంవత్సరంలో తేలిగ్గా ప్రవేశించాలి. పాత లగేజ్‌తో కాదు. ఎన్ని ఉంటాయి పాతవి ఇళ్లల్లో. పేరబెట్టుకొని. అడ్డంగా. స్పేస్ ఆక్యుపై చేసి. ఇంట్లో ఏయే పాత వస్తువుల బరువు దించుకోవాలో చూద్దామా? ఆ భారీ పాత సోఫా మన ఇంటి సోఫా జన్మ సంవత్సరం ఏమోగాని దాని ఆయుష్షు తీరి చాలా రోజులై ఉంటుంది. కవర్లు మార్చి, చిరిగిన చోట ప్యాచ్ వేసి, కిరకిరమంటుంటే మానేజ్ చేస్తూ, చిల్లులు పడుంటే పైన బెడ్‌షీట్ వేస్తూ... డబ్బులు లేకపోతే సరే. ఉంటే కొత్త సోఫా తెచ్చుకోండి. ఇల్లు కొత్తదిగా కనిపించాలంటే మారే కాలంతో పాటు వచ్చే ఫర్నీచర్ తెచ్చుకోవాలి. ఖరీదైనదే అక్కర్లేదు. రోడ్‌సైడ్ కూడా మోడరన్ ఫర్నీచర్ దొరుకుతుంది. ఆ పాత సోఫాను వాచ్‌మన్‌కు ఇచ్చేయండి. దానిని పెన్నిధిగా భావించే ఏ కారు డ్రైవర్కో లేదంటే అవసరం ఉన్నవారికో ఇచ్చేయండి. ఇల్లు బరువు తగ్గుతుంది. కొత్త కళ వస్తుంది. పాత బట్టలు, పుస్తకాలు ప్రతి ఇంట్లో ఏవి ఉన్నా ఏవి లేకున్నా ఇవి ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. భర్తవి, భార్యవి, పిల్లలవి మళ్లీ పొరపాటున వేసుకోరు అని తెలిసినా ఆ బట్టలను కూరి కూరి బీరువాలలో నింపి ఉంటారు. వాటిని ఈ చలికాలంలో పేదవారికి పంచేస్తే ఎంత గుండె తేలిక. ఇల్లు తేలిక. పిల్లలు స్కూలు పుస్తకాలు కూడా దాచి ఉంటారు. పాత క్లాసులవి ఎందుకు. ఎవరికైనా ఇచ్చేయొచ్చు. ఇంట్లో ఎప్పటెప్పటివో పుస్తకాలు ఉంటాయి. వాటిలో కొన్నే విలువైనవి. కొన్ని ఒకసారి చదివితే చాలనిపించేవి. ఆ ఒకసారి చదవదగ్గ పుస్తకాలను వేరేవాళ్లకు ఇచ్చేయాలి. హ్యాపీగా ఉంటుంది. షూ ర్యాక్ క్లీన్ చేయండి ప్రతి ఇంటి షూ ర్యాక్ పాత చెప్పులు, బూట్లు దుమ్ముపట్టి పోయి ఉంటాయి. వాటిని వాడేది లేదు. అలాగని పారేసేది లేదు. పిల్లల షూస్ కూడా ఉంటాయి. వాటిని పేద పిల్లలకు ఇచ్చేస్తే సంతోషంగా వేసుకుంటారు. చెప్పులు నిరుపేదలకు ఇచ్చేస్తే వేసుకుంటారు. పాతవి పోతే కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు. ఈ న్యూ ఇయర్‌కి కొత్త చెప్పులు తొడుక్కోండి. అటక మీద ఉంటుంది రహస్యం అటక మీద తోసేస్తాం చాలా. పాత తపేలాలు, కీబోర్డులు, చెంబులు, కుర్చీలు, మిక్సీలు, గ్రైండర్లు... అవన్నీ ఎందుకు దాస్తామో తెలియదు. వాటిని ఎవరికైనా ఇస్తే సరి చేయించుకుని వాడుకుంటారు. లేదా పాత సామాన్లవాడికి వేస్తే మనకే కొద్దిగా చిల్లర వస్తుంది. అవి బూజుపట్టి వికారంగా కనిపిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పరిపూర్ణంగా తిరుగాడదు. ఇంకా బాల్కనీల్లో అక్కర్లేని సామాన్లు ఉంటాయి. వాష్ ఏరియాల్లో బోలెడన్ని పనికిరాని వస్తువులు ఉంటాయి. మిద్దె మీద కొందరు పనికి రానిదంతా దాస్తారు ఎందుకో. అన్నీ పారేయండి. పంచేయండి. కొత్త సంవత్సరం కోసం ఇంటిని మీ మనసును తేలిగ్గా చేసుకోండి. కొత్త వెలుతురు కు దారి ఇవ్వండి. అదిగో ఇవాళ మీరు ఫలానా వస్తువు ఇచ్చారన్న ఆనందంతో కొంతమంది అయినా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేలా చేయండి. సరేనా?