Akshay Kumar New Year Wishes To Sun By Chanting Gayatri Mantra - Sakshi
Sakshi News home page

Akshay Kumar: అక్షయ్ కుమార్ పాజిటివ్‌ మంత్ర.. సూర్యుడికి శుభాకాంక్షలు

Published Sat, Jan 1 2022 7:24 PM | Last Updated on Sat, Jan 1 2022 7:37 PM

Akshay Kumar New Year Wishes To Sun By Chanting Gayatri Mantra - Sakshi

Akshay Kumar New Year Wishes To Sun By Chanting Gayatri Mantra: న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ అభిమానులకు విష్‌ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. అందరిలా ప్రియమైన వారికి, అభిమానులకు శుభాకాంక్షలు చెప్పలేదు ఈ పృథ్వీరాజ్‌. ఉదయాన్నే అందరిని నిద్ర నుంచి మేల్కొలిపే సూర్యుడికి గాయత్రి మంత్రం జపిస్తూ న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలిపాడు అక్కీ. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు 54 ఏళ్ల అక్షయ్‌ కుమార్‌. 

'నూతన సంవత్సరం. అదే నేను. నిద్ర లేచి నా పాత స్నేహితుడు సూర్యుడికి శుభాకాంక్షలు తెలిపాను. కరోనా కాకుండా మిగతా అన్ని అంశాలు పాజిటివ్‌గా ఉండేలా 2022 సంవత్సరాన్ని ప్రారంభించాను. అందరి ఆరోగ్యం, ఆనందం కోసం ప్రార్థిస్తున్నాను. హ్యాపీ న్యూయర్‌.' అని రాసిన క్యాప్షన్‌తో వీడియో పోస్ట్‌ చేశాడు అక్కీ. ఈ పోస్టులో సూర్యుడికి ఎదురుగా నమస్కరిస్తూ గాయత్రి మంత్రాన్ని జపించాడు. అక్షయ్‌ కుమార్‌ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్‌, బచ్చన్‌ పాండే,  రక్షా బంధన్‌, రామ్‌ సేతు, ఓ మై గాడ్! 2 చిత్రాలు ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement