gayatri mantra
-
దటీజ్ నీతా అంబానీ : ఈ బెనారసీ చీర స్పెషాల్టీ ఏంటో తెలుసా?
సందర్భానికి తగినట్టు దుస్తులను, నగలను, అలంకరణను ఎంచుకోవడంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీది ఎపుడూ అందెవేసిన చేయి. పట్టు చీరలు, బెనారసీ, స్వదేశీ నేత చీరలు అంటే ఆమెకు ప్రాణం. తాజాగా తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీనికి గుట్టపూసల నెక్లెస్, స్టైలిష్ చెవిపోగులు, బన్, గజ్రా (మల్లె పూల దండ)తో ఇలా ప్రతీ విషయంలో తన ష్యాషన్ స్టయిల్‌ను చాటుకున్నారామె. తన సిగ్నేచర్ స్టైల్లో ఆమె లుక్, ముఖ్యంగా చీరలోని మరో ప్రత్యేకత విశేషంగా నిలిచింది. అనంత్-రాధిక వివాహ సన్నాహాకాలు జోరందుకున్న నేపథ్యంలో జూలై 12,మంగళవారం నిరుపేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలో నీతా అంబానీ ముదురు ఎరుపు రంగు బెనారసీ చీరలో మహారాణిలా కనిపించారు. ముఖ్యంగా చీర ఒక విషయంలో అందరినీ ఆకర్షించింది. పవిత్ర గాయత్రీ మంత్రాన్ని బంగారంతో ఎంబ్రాయిడరీ చేయించడమే దీనికి కారణం. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బంగారు జరీ వర్క్, పక్షుల డిజైన్‌తో తీర్చి దిద్దిన అద్భుతమైన బెనారసి చీరకు తగ్గట్టుగా గుట్టపూసల నెక్లెస్‌ను ధరించారు. ఈ నెక్లెస్ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాంప్రదాయ దక్షిణ భారత డిజైన్‌తో పోలి ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే చెవిపోగుల్లో శ్రీకృష్ణుని బొమ్మను కూడా గమనించవచ్చు.కాగా సామూహిక వివాహ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోపాటు పెద్ద కుమారుడు, ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ పిరమల్,, భర్త ఆనంద్ పిరమల్ పాల్గొన్నారు. శ్లోకా, నీతా ఇద్దరూ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు. దేశవిదేశాలకు అతిరథ మహారథులసమక్షంలో జూలై 12న అనంత్-రాధిక వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. -
అక్షయ్ కుమార్ పాజిటివ్ మంత్ర.. సూర్యుడికి శుభాకాంక్షలు
Akshay Kumar New Year Wishes To Sun By Chanting Gayatri Mantra: న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు విష్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. అందరిలా ప్రియమైన వారికి, అభిమానులకు శుభాకాంక్షలు చెప్పలేదు ఈ పృథ్వీరాజ్. ఉదయాన్నే అందరిని నిద్ర నుంచి మేల్కొలిపే సూర్యుడికి గాయత్రి మంత్రం జపిస్తూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపాడు అక్కీ. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు 54 ఏళ్ల అక్షయ్ కుమార్. 'నూతన సంవత్సరం. అదే నేను. నిద్ర లేచి నా పాత స్నేహితుడు సూర్యుడికి శుభాకాంక్షలు తెలిపాను. కరోనా కాకుండా మిగతా అన్ని అంశాలు పాజిటివ్‌గా ఉండేలా 2022 సంవత్సరాన్ని ప్రారంభించాను. అందరి ఆరోగ్యం, ఆనందం కోసం ప్రార్థిస్తున్నాను. హ్యాపీ న్యూయర్.' అని రాసిన క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేశాడు అక్కీ. ఈ పోస్టులో సూర్యుడికి ఎదురుగా నమస్కరిస్తూ గాయత్రి మంత్రాన్ని జపించాడు. అక్షయ్ కుమార్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, రామ్ సేతు, ఓ మై గాడ్! 2 చిత్రాలు ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
ఆ ఉత్తర్వులపై మైనారిటీ కమిషన్ అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ స్కూల్స్‌లో గాయత్రి మంత్రం పఠించాలనే నిబంధన దుమారం రేపింది. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులచే గాయత్రి మంత్రం పఠించాలని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఢిల్లీ మైనారిటీ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సదరు సంస్థకు మైనారిటీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పాఠశాల అసెంబ్లీలో ఉదయాన్నే గాయత్రి మంత్రం జపించాలని ఎందుకు ఉత్తర్వులు జారీ చేశారో వివరణ ఇవ్వాలని కోరామని ఢిల్లీ మైనారిటీ కమిషన్ చీఫ్ జఫరుల్ ఇస్లాం ఖాన్ తెలిపారు. ఎన్డీఎంసీ ఉత్తర్వులు లౌకిక స్ఫూర్తికి విఘాతమని, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధులు ఓ మతానికి చెందిన మంత్రాలను పఠించేందుకు ఇష్టపడరని చెప్పారు. కాగా, గాయత్రి మంత్రం జపించాలనే ఉత్తర్వులను ఎన్డీఎంసీ అధికారులు సమర్ధించుకున్నారు. స్కూళ్లలో గాయత్రి మంత్రం పఠించాలనే ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాల్సినవి కాదని స్పష్టం చేశారు. ఎన్డీఎంసీ పరిధిలో 765 పాఠశాలలు నిర్వహిస్తున్నక్రమంలో 2.2 లక్షల మంది విద్యార్ధులు అభ్యసిస్తున్నారు. -
అప్పుడు గీతా శ్లోకాలు.. ఇప్పుడు గాయత్రి మంత్రం
హర్యానా : పాఠ్య పుస్తకాల్లో గీతా శ్లోకాలను ప్రవేశపెట్టిన హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు ముందుకు వేసింది. పాఠశాలల్లో రోజువారి ప్రార్థనా గీతంగా గాయత్రి మంత్రాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈమేరకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. దీనికి సంభందించి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నత విలువలు, సంస్కృతి, సంప్రాదాయలను పెంపొందించేందు గాయత్రి మంత్రం సహాయపడుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి రామ్ బిలాష్ శర్మ నిర్ధారించారు. డిపార్టుమెంట్‌లోని పలువురు సీనియర్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు గాయత్రి మంత్రం గొప్పతనం తెలిసేలా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గాయత్రి మంత్రం సాథువులు,రుషులు ప్రపంచానికిచ్చిన వరం అని విద్యాశాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ తెలిపారు. ఇక పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో గాయత్రి మంత్రం తప్పనిసరి అన్నారు. 2015లోనే గీతా శ్లోకాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఖట్టర్ భావించినా ప్రతిపక్షాలనుంచి తీవ్ర విమర్శలు రావడంతో 2016లో సిలబస్‌గా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
పాకిస్ధాన్లో గాయత్రి మంత్రం పఠనం
-
యువతి గాయత్రి మంత్రం.. షరీఫ్ చప్పట్లు
కరాచీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొలువుదీరిన ఓ కార్యక్రమంలో హిందూ యువతి చక్కగా గాయత్రి మంత్రానికి సంబంధించిన గీతాన్ని పాడి అందరి హృదయాలను దోచుకుంది. అక్కడ ఉన్న అంతా ఆమెపై చప్పట్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు శ్రద్ధగా విన్న ప్రధాని షరీఫ్ కూడా పాట ముగిసిన తర్వాత చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల (మార్చి) 15న పాకిస్థాన్‌లో మైనారిటీలు అయిన హిందువులు హోలీ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమం ఏర్పాటుచేయగా దానికి ప్రధాని షరీఫ్‌తోపాటు పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తొలుత మాట్లాడిన ఆయన హిందువులకు అన్ని రకాల రక్షణను కల్పిస్తామని చెప్పారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి హిందువులను మార్చడాన్ని ఖురాన్ అంగీకరించబోదని అన్నారు. పాక్‌లోని మైనారిటీల హక్కులు రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. అనంతరం నరోదా మాలిని అనే బాలిక ఒక్కసారిగా గాయత్రి మంత్రాన్ని గానం చేసి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేదికపై ఉన్నవారంతా కూడా ఓ రకమైన ఆసక్తికి లోనై పాట పూర్తయ్యే వరకు చాలా చక్కగా విని చప్పట్లతో అభినందించారు. -
గాయత్రీ మంత్రం 24 అక్షరాలే!
విమర్శ ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యమ్ భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ ఇది మనకు తెలిసిన గాయత్రీ మంత్రం. ఈ గాయత్రీ మంత్రాన్ని మనం చాలా సార్లు చదివే ఉంటాం. చాలా సార్లు వినే ఉంటాం. కొన్ని సార్లయినా అనే ఉంటాం. చాలా కాలంగా గాయత్రీ మంత్రం ఈ రూపంలో మనలో చలామణిలో ఉంది. కాలక్రమంలో కొన్ని విషయాలలో కొన్ని తప్పులు దొర్లడం మనం చూసిందే. అలా గాయత్రీ మంత్రం విషయంలోనూ ఒక పొరపాటు జరిగింది. గాయత్రీ ఛందస్సు ఇరవై నాలుగు అక్షరాలు కలది. అంటే గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలే ఉండాలి. ఇది శాస్త్రం. నిజానికి గాయత్రీ మంత్రం ఇరవై నాలుగు అక్షరాలదే. ప్రస్తుతం చలామణిలో ఉన్న గాయత్రీ మంత్రంలో మాత్రం మనకు ఇరవై ఎనిమిది అక్షరాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఎక్కడో ఈ మంత్రం ఆకృతి మారింది. భూః , భువః ,స్వః, అన్నవి వ్యాహృతులు. ముందు ఈ వ్యాహృతులను పలికాక నిజమైన మంత్రాన్ని పలికే పద్ధతి ఉండేది. ‘మంత్రాణామ్ ప్రణవశ్శిరః’ కదా? ఓం కారంతో గాయత్రీ మంత్రం – ఓం తత్ సవితుర్వరేణ్యమ్ – ఎనిమిది అక్షరాలు భర్గో దేవస్య ధీ మహి – ఎనిమిది అక్షరాలు ధియో యోనః ప్రచోదయాత్ – ఎనిమిది అక్షరాలు వెరసి ఇరవై నాలుగు అక్షరాలు. ఓం కారాన్ని వ్యాహృతులైన భూః, భువః, స్వః లకు ముందు చేర్చి మంత్రోచ్చారణ చెయ్యడం పొరపాటున ఎప్పుడో ఎక్కడో మొదలయి ఉంటుంది. అందువల్ల గాయత్రీ మంత్రంలో ప్రస్తుతం మనకు ఇరవై ఎనిమిది అక్షరాలు కనిపిస్తున్నాయి. ఋషి ప్రోక్త గాయత్రీ మంత్రం: ‘‘ఓం తత్ సవితుర్వరేణ్యమ్ భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్.’’ నాకు దొరికిన ఈ పురాతన భాస్కర యంత్రంలో కూడా ఈ ఇరవై నాలుగు అక్షరాల గాయత్రీ మంత్రమే కనిపిస్తోంది. ఇదే సరైన గాయత్రీ మంత్రం. మరో విషయం, ఇవాళ మనకు పలు దేవతల గాయత్రీలు కనిపిస్తున్నాయి. అవి ఇరవై అక్షరాల ఆకృతిలో లేవు. అంటే వాటికి శాస్త్రీయ ప్రాతిపదిక లేదనేది నిర్వివాదాంశం. ఇప్పటికైన మనం సరైన అవగాహనతో ఋషి ప్రోక్త గాయత్రీ మంత్రాన్ని అనుసంధానం చేసుకుందాం. వ్యాసకర్త : రోచిష్మాన్ 094440 12279