హర్యానా : పాఠ్య పుస్తకాల్లో గీతా శ్లోకాలను ప్రవేశపెట్టిన హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు ముందుకు వేసింది. పాఠశాలల్లో రోజువారి ప్రార్థనా గీతంగా గాయత్రి మంత్రాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈమేరకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. దీనికి సంభందించి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నత విలువలు, సంస్కృతి, సంప్రాదాయలను పెంపొందించేందు గాయత్రి మంత్రం సహాయపడుతుందంటూ వ్యాఖ్యానించారు.
ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి రామ్ బిలాష్ శర్మ నిర్ధారించారు. డిపార్టుమెంట్‌లోని పలువురు సీనియర్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు గాయత్రి మంత్రం గొప్పతనం తెలిసేలా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గాయత్రి మంత్రం సాథువులు,రుషులు ప్రపంచానికిచ్చిన వరం అని విద్యాశాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ తెలిపారు. ఇక పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో గాయత్రి మంత్రం తప్పనిసరి అన్నారు. 2015లోనే గీతా శ్లోకాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఖట్టర్ భావించినా ప్రతిపక్షాలనుంచి తీవ్ర విమర్శలు రావడంతో 2016లో సిలబస్‌గా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment