భారత అథ్లెటిక్స్‌లో స్వర్ణ చరిత్ర లిఖించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అటు ప్రశంసలు ఇటు రూ. కోట్లు కురుస్తున్నాయి. హరియాణాకు చెందిన ఈ చాంపియన్ అథ్లెట్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ భారీ నజరానా ప్రకటించారు. హరియాణా క్రీడాపాలసీ ప్రకారం అతనికి రూ. 6 కోట్ల పారితోషికం, క్లాస్–1 ఉన్నతోద్యోగంతో పాటు నివాస స్థలం (నామమాత్రపు ధరతో) ఇస్తామని సీఎం తెలిపారు. కాంస్యం నెగ్గిన రెజ్లర్ బజరంగ్ పూనియాకు రూ.2 కోట్ల 50 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం, నివాస స్థలం అందజేస్తామని చెప్పారు.
ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు క్రికెట్ వర్గాలు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా రూ. ఒక కోటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రూ. ఒక కోటి నజరానాగా ఇస్తామని వెల్లడించింది. దేశీ వాహనరంగ సంస్థ మహీంద్ర త్వరలో విడుదల చేసే ‘ఎక్స్‌యూవీ700’ ప్రీమియం కారును తొలుత నీరజ్‌కే బహుమతిగా ఇస్తామని మహీంద్ర గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment