chanting
-
మోదీ భజన చేసే యువత చెంప పగలగొట్టాలి: కర్ణాటక మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కర్ణాటక రాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని, ప్రధానిని పొగిడే యువత చెంప పగలగొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి అన్నారు. కారటగిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శివరాజ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మరోసారి ప్రజలను మోసం చేయవచ్చని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. ‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. ఇచ్చారా? మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతిచ్చే యువత సిగ్గుపడాలి. వాళ్ల చెంప పగలగొట్టాలి. పదేళ్లుగా అబద్ధాలతోనే నడిపించారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఒక్కటైనా చెప్పండి’ అని ప్రశ్నించారు. ‘ఆయన (ప్రధాని మోదీ) తెలివైనవాడు. బాగా దుస్తులు ధరిస్తాడు. స్మార్ట్ ప్రసంగాలు చేస్తాడు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి పూజలు చేస్తూ స్టంటులు చేస్తాడు. ఒక ప్రధానమంత్రి చేయవలసిన పని ఇదేనా?’ అన్నారు. -
Ayodhya: శోభాయమానం.. రామమయం
అయోధ్య/న్యూఢిల్లీ: రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభాయమానంగా మారుతోంది. నగమంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఎటు చూసినా ‘శుభవేళ రానే వచ్చింది’, ‘అయోధ్య సిద్ధమైంది’ అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆహూతులకు హార్దిక స్వాగతం పలుకుతున్నాయి. లౌడ్‌స్పీకర్ల నిండా రామ నామం, భక్తి గీతాలు మార్మోగుతున్నాయి. అయోధ్య అణువణువూ రామమయంగా మారింది. రామాలయ ప్రారంభ సన్నాహాలు తుది దశకు చేరుతున్నాయి. గర్భాలయంలో కొలువుదీరిన బాలరాముని విగ్రహాన్ని శనివారం పవిత్ర సరయూ నదీజలాలతో అభిషేకించారు. గర్భాలయాన్ని కూడా నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. మంత్రోచ్చారణ నడుమ శుదీ్ధకరణ కార్యక్రమాలు ముగిశాయి. అనంతరం శా్రస్తోక్తంగా వాస్తు శాంతి, అన్నాధివాస, పుష్పాధివాస క్రతువులు జరిపారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రసాదాలు, పుష్పాలతో బాలరామునికి నివేదన జరిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించారు. బాలరామునికి ఆదివారం 125 కలశాలతో మంగళస్నానం జరగనుంది... దర్శనాలకు బ్రేక్ తాత్కాలిక మందిరంలో పూజలందుకుంటున్న ప్రస్తుత రామ్‌లల్లా విగ్రహాన్ని నూతన గర్భాలయంలోకి చేర్చే ప్రక్రియకు కూడా అర్చకులు శ్రీకారం చుట్టారు. నూతన విగ్రహంతో పాటు ఈ విగ్రహాన్ని కూడా గర్భాలయంలో ప్రతిష్టించనుండటం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నుంచే తాత్కాలిక ఆలయంలో దర్శనాలు నిలిపేశారు. ఈ విగ్రహాన్ని బహుశా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా గర్భాలయంలోకి తీసుకెళ్తారని అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. గుడారం నుంచి తాత్కాలిక మందిరంలోకి కూడా ఈ విగ్రహాన్ని ఆదిత్యనాథే తీసుకెళ్లారు. విమానాల వరద... అయోధ్యకు వీఐపీల రాక ఇప్పటికే మొదలైంది. ఆదివారం నాటికి ఇది ఊపందుకోనుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దాదాపు 7,000 మందికి ఆహా్వనాలు అందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని అయోధ్యకు చేరవేసేందుకు సోమవారం ఏకంగా 100కు పైగా చార్టర్డ్ ఫ్లైట్లు రానున్నట్టు చెబుతున్నారు. వీటి తాకిడిని తట్టుకోవడం కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి శక్తికి మించిన పనే కానుంది. ఇప్పటికే 40కి పైగా విమానాల ల్యాండింగ్‌కు విజ్ఞప్తులు అందినట్టు చెబుతున్నారు. కానీ నిబంధనల ప్రకారం ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్ ల్యాండయ్యాక విమానాశ్రయంలోకి మరే విమానాన్నీ అనుమతించరు. ఈ నేపథ్యంలో వీఐపీలు దిగీ దిగగానే వచి్చన విమానాన్ని వచి్చనట్టే వారణాసి, లఖ్‌నవూ తదితర సమీప విమానాశ్రయాలకు పంపనున్నారు. ప్రధాని వెనుదిరిగాక వాటిని ఒక్కొక్కటిగా తిరిగి అయోధ్యకు అనుమతిస్తారు. 2 నెలలు..2 కోట్ల మంది! రామాలయ ప్రారంభం అనంతరం అయోధ్యకు దేశ నలుమూలల నుంచీ భారీగా భక్తులను తరలించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జనవరి 25 నుంచి మార్చి 25 దాకా 2 కోట్ల మందికి దర్శనం కలి్పంచనుంది. ఒక్కో లోక్‌సభ నియోజవర్గం నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 543 లోక్‌సభ స్థానాల నుంచీ భక్తులను తరలించనుంది. ఇందుకోసం వందలాది ప్రత్యేక రైళ్లతో పాటు బస్సులు తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఫొటోలు లీకయ్యాయి: పూజారి ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలి’’ అని కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్‌నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది. యజమానులుగా 14 మంది దంపతులు ప్రాణప్రతిçష్ట క్రతువులో 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొననున్నారు. వీరిని దేశవ్యాప్తంగా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి ఎంపిక చేశారు. వీరందరి సమగ్ర భాగస్వామ్యంలో పూజలు, క్రతువులు జరుగుతాయని రామ జన్మభూమి ట్రస్టు వర్గాలను ఉటంకిస్తూ ఆరెస్సెస్ నేత సునీల్ అంబేడ్కర్ వివరించారు. జైషే బెదిరింపులు ప్రాణప్రతిష్ట సమీపిస్తున్న వేళ అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చేసిన హెచ్చరిక అలజడి రేపుతోంది. హింసాత్మక ప్రతీకారం తప్పదని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో హెచ్చరించడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలు పరిస్థితిని డేగ కళ్లతో గమనిస్తున్నాయి. ‘రామ’ రైల్వేస్టేషన్లకు విద్యుత్ వెలుగులు రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 343 రైల్వేస్టేషన్లున్నాయి. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇవన్నీ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోనున్నాయి. రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం! 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం అయోధ్య రామునికి దేశ విదేశాల నుంచి వినూత్న కానుకల వరద కొనసాగుతూనే ఉంది. వీటిలో భాగంగా ఏకంగా 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం శనివారం అయోధ్య చేరాయి. లడ్డూను హైదరాబాద్‌కు చెందిన నాగభూషణంరెడ్డి అనే భక్తుడు, తాళాన్ని యూపీలోని అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ దంపతులు తయారు చేయించారు. శర్మ ఇటీవలే మరణించారు. తాళాన్ని రామునికి సమరి్పంచాలంటూ చివరి కోరిక కోరారు. ఆ మేరకు ఆయన భార్య దాన్ని అయోధ్య చేర్చారు. దీన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తాళంగా చెబుతున్నారు. తాళాల తయారీకి అలీగఢ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. 25 మంది 3 రోజుల పాటు శ్రమించి లడ్డూను తయారు చేసినట్టు నాగభూషణంరెడ్డి చెప్పారు. ఇది నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందన్నారు. ప్రత్యేక ప్రసాదాలు ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక ప్రసాదాలు అలరించనున్నాయి. టెప్లా, బాదం మిఠాయి, మటర్ కచోరీ తదితరాలను సోమవారం బాలరామునికి నివేదిస్తారు. అనంతరం వాటిని, తిరుమల శ్రీవారి లడ్డూలు, 1,265 కిలోల భారీ లడ్డూతో పాటు దేశ నలుమూలల నుంచి వచి్చన ఇతర ప్రసాదాలను భక్తులకు అందిస్తారు. మరోవైపు బాలరాముని నివేదన కోసం లక్నో నుంచి ఛప్పన్ భోగ్ (56 రకాల భోజన పదార్థాల)తో కూడిన వెండి థాలీ కూడా అయోధ్యకు చేరింది. -
సభలో మోదీ మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో శుక్రవారం ప్రధాని మోదీ, సీఎం సిద్ధరామయ్య పాల్గొన్న ఒక కార్యక్రమంలో సభికులంతా ఒక్కసారిగా మోదీ మోదీ అని నినాదాలు చేశారు. దీంతో సిద్ధరామయ్య వైపు తిరిగిన మోదీ ‘ముఖ్యమంత్రీ జీ అయిసా హోతా రెహతా’ హే(ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి)అని సర్ది చెప్పారు. దీనికి సిద్ధరామయ్య కాస్త అసౌకర్యంగా నవ్వారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. దేశంలో ప్రధాని మోదీని, ఆయన విధానాలను గట్టిగా విమర్శించే నేతల్లో సిద్ధరామయ్య ఒకరు కావడం గమనార్హం. బోయింగ్ గ్లోబల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ క్యాంపస్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బెంగళూరు విచ్చేశారు. అనంతరం అక్కడ సభనుద్దేశించి ప్రధాని మాట్లాడుతుండగా సభలో ఒక్కసారిగా మోదీ మోదీ నినాదాలు మార్మోగాయి. #WATCH | "Mukhyamantri ji aisa hota rehta hai," says PM Narendra Modi to Karnataka CM Siddaramaiah as people chant 'Modi-Modi' during the inauguration event of the new Boeing India Engineering & Technology Center campus in Bengaluru. pic.twitter.com/hrzWIUAyIJ — ANI (@ANI) January 19, 2024 ఇదీచదవండి.. బాల్యాన్ని గుర్తుచేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగం -
‘జై శ్రీరామ్’ నినాదాలు.. దీదీ అసహనం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పబ్లిక్‌గా తన అసహనం ప్రదర్శించారు. ప్రధాని గౌరవ అతిథిగా పాల్గొన్న ఓ అధికారిక కార్యక్రమంలో జరిగిన ఘటనతో కలత చెందిన ఆమె.. వేదిక మీదకు వెళ్లేందుకు నిరాకరించారు. పశ్చిమ బెంగాల్ హౌరా స్టేషన్లో ఇవాళ(శుక్రవారం) వందే భారత్ ఎక్స్‌ప్రెస్(దేశంలో ఏడవది) ప్రారంభ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. తల్లి చనిపోయిన బాధలో ఉండి కూడా వర్చువల్‌గా ఈ కార్యక్రమానికి హాజరై రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. అయితే.. సీఎం మమతా బెనర్జీ స్టేషన్ వద్దకు చేరుకున్న సమయంలో.. అక్కడున్న కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై.. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది. దీంతో.. ఆమె అసంతృప్తిగా కనిపించారు. నినాదాలు చేస్తున్న వాళ్లను తదేకంగా చూస్తూ ఉండిపోయారు. వేదిక మీదకు వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. అది గమనించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో.. ప్రభుత్వాధికారులతో కలిసి పక్కనే కుర్చీలో కూర్చున్నారు ఆమె. ఇక హౌరా-న్యూ జలపైగురి మధ్య నడిచే వందే భారత్ రైలు బయల్దేరే సమయంలోనూ కొందరు జై శ్రీరామ్, జై మోదీ నినాదాలు చేశారు. ఆ సమయంలోనూ ఆమె తన అసహనం ప్రదర్శించారు. మరోవైపు .. హీరాబెన్ మోదీ కన్నుమూతపై.. సంతాపం తెలిపిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. విశ్రాంతి తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి సూచించారు. ‘‘తల్లికి మించిది ఏదీ లేదు. ఆమె మీ అమ్మే కాదు.. మా అమ్మ కూడా..! నేను కూడా మా అమ్మని చాలా మిస్ అయ్యాను. మీరు ప్రోగ్రామ్‌లో వర్చువల్‌గా చేరడం మాకు చాలా గౌరవం. కార్యక్రమం తర్వాత విశ్రాంతి తీసుకోండి’’ అని సూచించారామె. -
లోక్ సభలో ‘మోదీ.. మోదీ..’
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన తర్వాత లోక్‌సభలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలోకి అడుగుపెట్టగానే బీజేపీ ఎంపీలంతా పెద్దఎత్తున మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రధాని లోక్‌సభలోకి అడుగుపెట్టగానే సభ్యులంతా ఒక్కసారిగా నిలబడి ‘మోదీ’ నినాదాలతో సభను మారుమోగించారు. సభ్యులకు నమస్కరించిన మోదీ తన స్థానంలో కూర్చున్నారు. సోమవారం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను వీక్షించడానికి వచ్చిన ఆస్ట్రియా పార్లమెంటరీ ప్రతినిధి బృందం గురించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు చెబుతున్న సమయంలో ప్రధాని మోదీ లోక్‌సభలోకి ప్రవేశించారు. అనంతరం ఆస్ట్రియా పార్లమెంట్ ప్రతినిధి బృందానిక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. పార్లమెంటరీ పార్టీ విక్లీ సమావేశం మంగళవారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉభయ సభలకు చెందిన పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, గోవా, మణిపూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి.. తిరిగి అధికారం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. Prime Minister Narendra Modi welcomed by the BJP MPs in Lok Sabha, amid chants of "Modi, Modi", following the party's victory in assembly elections in Goa, Manipur, Uttarakhand, and Uttar Pradesh. pic.twitter.com/IZuF36mDNB — ANI (@ANI) March 14, 2022 -
అక్షయ్ కుమార్ పాజిటివ్ మంత్ర.. సూర్యుడికి శుభాకాంక్షలు
Akshay Kumar New Year Wishes To Sun By Chanting Gayatri Mantra: న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు విష్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. అందరిలా ప్రియమైన వారికి, అభిమానులకు శుభాకాంక్షలు చెప్పలేదు ఈ పృథ్వీరాజ్. ఉదయాన్నే అందరిని నిద్ర నుంచి మేల్కొలిపే సూర్యుడికి గాయత్రి మంత్రం జపిస్తూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపాడు అక్కీ. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు 54 ఏళ్ల అక్షయ్ కుమార్. 'నూతన సంవత్సరం. అదే నేను. నిద్ర లేచి నా పాత స్నేహితుడు సూర్యుడికి శుభాకాంక్షలు తెలిపాను. కరోనా కాకుండా మిగతా అన్ని అంశాలు పాజిటివ్‌గా ఉండేలా 2022 సంవత్సరాన్ని ప్రారంభించాను. అందరి ఆరోగ్యం, ఆనందం కోసం ప్రార్థిస్తున్నాను. హ్యాపీ న్యూయర్.' అని రాసిన క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేశాడు అక్కీ. ఈ పోస్టులో సూర్యుడికి ఎదురుగా నమస్కరిస్తూ గాయత్రి మంత్రాన్ని జపించాడు. అక్షయ్ కుమార్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, రామ్ సేతు, ఓ మై గాడ్! 2 చిత్రాలు ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
ఇంత పారవశ్యమా, ఇలాంటి వీడియో మీరెపుడూ చూసి ఉండరు
దసరా పండుగ వేళ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. ఒక కోతి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఏకంగా ఒక సాధువు ఒడిలో కూర్చున్న వానరం లయబద్ధంగా కర్తల్ ప్లే చేసి అక్కడున్న వారినందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్వయంగా ఆ రాముడి కోసం దిగి వచ్చిన హనుమాన్ అంటూ ముగ్ధులవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఒక కోతి భజన చేస్తున్న సాధువుల చెంతకు చేరింది. వారితో పాటు భక్తి కీర్తనల్లో మునిగియంది. తాళానికి కనుగుణంగా భజనలో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఆనందంలో మునిగిపోయింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయితున్నారు. ఇది హనుమంతుడి రూపమే అంటూ మురిసి పోతున్నారు. ఇంత పారవశ్యామా ఇలాంటి కోతిని తాను ఎన్నడూ చూడలేదు అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. చాలా ఆనందంగా ఉందంటూ మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. పంకజ్ పరాశర్ తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మందికి వీక్షించగా, 30 వేల మంది షేర్ చేశారు. -
వేదాలు చదవండి.. దిగుబడి పెంచుకోండి
పణజీ: పంట పొలాల్లో 20 రోజుల పాటు.. రోజుకు కనీసం 20 నిమిషాల చొప్పున వేదాలను వల్లె వస్తే పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని, ఈ ‘కాస్మిక్ ఫార్మింగ్’ను పాటించాలని రైతులకు గోవా సర్కారు సూచించింది. తద్వారా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలను పండించవచ్చంది. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం శివ యోగా ఫౌండేషన్, బ్రహ్మకుమారీస్ తదితర సంస్థలను సంప్రదిస్తోందని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యవసాయ మంత్రి విజయ్ సర్దేశాయి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ నెల్సన్ ఫిజీరెడొలు ఇటీవలే గురుగ్రామ్‌లోని శివ యోగా ఫౌండేషన్‌కు చెందిన గురు శివానంద్‌తో ప్రత్యేకంగా భేటీ అయి కాస్మిక్ ఫార్మింగ్ ఉపయోగాలపై చర్చించారని ఆయన వెల్లడించారు. పంట పొలాల్లో వేద పఠనం వల్ల విశ్వంలోని శక్తి ఆ భూమిలోకి వచ్చి పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని నెల్సన్ ఫిజీరెడొ తెలిపారు. -
'భారత మాతాకీ జై అంటే సమస్యలు పరిష్కారం కావు: శివసేన
ముంబై: 'భారతమాతాకీ జై' అని నినాదాలు చేసే బదులు రాష్ట్రంలోని నీటి సమస్యకు పరిష్కారంను సూచించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సత్వరచర్యలు తీసుకోకుంటే శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 'భారతమాతాకీ జై' అని నినదిస్తూ తన సీటును కాపాడుకోలేరని శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో ఘాటుగా విమర్శించింది. గత ప్రభుత్వాలు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమేనని తెలిపింది. యువతలో అసహనం పెరిగి మావోయిజం వైపు ఆకర్షితులవుతున్నారని ఇలాంటి పరిసితుల్లో 'భారత మాతాకీ జై' అనే నినాదాలు చేస్తే లాభం లేదని నిర్మొహమాటంగా పేర్కొంది. ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో 40 రోజులకొకసారి కూడా తాగునీరు రావడంలేదని, పుణే, థానె, నాగపూర్, ముంబైల్లో పరిస్థితి దారుణంగా ఉందని రాష్ట్రం స్మశానాన్ని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలు మూతపడుతున్నాయని, దేశభక్తి పేరుతో ప్రజల దాహం తీర్చలేమంటే సహించేదిలేదని హెచ్చరించింది. -
చాలీసా పారాయణంలో.. గిన్నిస్ రికార్డు!