న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన తర్వాత లోక్‌సభలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలోకి అడుగుపెట్టగానే బీజేపీ ఎంపీలంతా పెద్దఎత్తున మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రధాని లోక్‌సభలోకి అడుగుపెట్టగానే సభ్యులంతా ఒక్కసారిగా నిలబడి ‘మోదీ’ నినాదాలతో సభను మారుమోగించారు. సభ్యులకు నమస్కరించిన మోదీ తన స్థానంలో కూర్చున్నారు.
సోమవారం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను వీక్షించడానికి వచ్చిన ఆస్ట్రియా పార్లమెంటరీ ప్రతినిధి బృందం గురించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు చెబుతున్న సమయంలో ప్రధాని మోదీ లోక్‌సభలోకి ప్రవేశించారు. అనంతరం ఆస్ట్రియా పార్లమెంట్ ప్రతినిధి బృందానిక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. పార్లమెంటరీ పార్టీ విక్లీ సమావేశం మంగళవారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉభయ సభలకు చెందిన పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, గోవా, మణిపూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి.. తిరిగి అధికారం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే.
Prime Minister Narendra Modi welcomed by the BJP MPs in Lok Sabha, amid chants of "Modi, Modi", following the party's victory in assembly elections in Goa, Manipur, Uttarakhand, and Uttar Pradesh. pic.twitter.com/IZuF36mDNB
— ANI (@ANI) March 14, 2022
Comments
Please login to add a commentAdd a comment