ఢిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తేదీన పార్లమెంట్ కొత్త భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్లమెంటు ప్రారంభోత్సవానికి రావలసిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు లోకసభ స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో భవనం ప్రారంభించి.. జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ.
వందేళ్ళ కాలంనాటి పాత పార్లమెంటులో సరైన వసతులు లేకపోవడంతో పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం చేపట్టింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆత్మ నిర్భరకు సంకేతంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఉండనుంది. భారత ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టేలా భారత సంస్కృతి చిహ్నాలతో నిర్మాణం చేపట్టారు.
కొత్త భవనంలో.. లోక్‌సభలో 888 మంది ఎంపీలు, రాజ్యసభలో 300 మంది ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశం.. లోక్ సభలోనే నిర్వహించనున్నారు . ఇక.. ఉభయ సభల సంయుక్త సమావేశంలో 1280 మంది ఎంపీలు కూర్చునే ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment