'ల్యాండ్ పూలింగ్ నుంచి మమ్మల్ని తప్పించండి'
హైదరాబాద్: తమను ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పించాలంటూ 300 మంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ల్యాండ్ పూలింగ్కు తమ భూములు ఇచ్చేంది లేదంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన రైతులంతా 9.3 ఫారాలను కోర్టుకు అందజేశారు. దాంతో విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.