సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న స్టార్టప్ ఏరియా నిర్మాణానికి అవసరమైన భూముల్ని భూసేకరణ ద్వారానే తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రైతుల భూముల్ని ల్యాండ్‌పూలింగ్ ద్వారా గానీ లేదా భూసేకరణ చట్టం కింద గానీ తీసుకోకుండా టెండర్ నోటిఫికేషన్‌లో చేర్చడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.