‘మెట్రో రైల్’కు తొలగిన అడ్డంకులు
- భూసేకరణ కేసుల్లో స్టేలు ఎత్తేస్తూ హైకోర్టు తీర్పు
- 2013 భూసేకరణ చట్టం కిందే పరిహారం చెల్లింపునకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ భూసేకరణ కున్న అడ్డంకులన్నీ తొలగిపోయారుు. భూసే కరణ విషయంలో ఇప్పటివరకు ఉన్న స్టేలన్నింటినీ కూడా ఉమ్మడి హైకోర్టు ఎత్తేసింది. మెట్రోరైల్ నిర్మాణం కోసం నాంపల్లి ప్రాంతంలో సేకరించిన భూములకు 2013 భూ సేకరణ చట్టం కిందే పరిహారం చెల్లించాలని మెట్రో యజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరిం చింది. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన తరు వాత పాత తేదీలతో పరిహారం ఉత్తర్వులు జారీ చేశారన్న సింగిల్ జడ్జి అభిప్రాయాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది.
మెట్రో రైల్ నిర్మాణం కోసం నాంపల్లి ప్రాంతంలో 20 ఆస్తుల సేకరణకు అధికారులు నిర్ణరుుంచి ఆ మేర నోటిఫికేషన్ జారీ చేశారు. సేకరిస్తున్న ఆస్తులకు సంబంధించిన పరిహారాన్ని 2013లో నిర్ణరుుంచారు. 2014లో అందుకు సంబంధించిన ఉత్తర్వులను బాధితులకు తెలియచేశారు. అరుుతే అప్పటికి 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిందని, అందువల్ల తమకు ఆ చట్టం కింద పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పలువురు భూ యజమానులు హైకోర్టును ఆశ్రరుుంచారు. ఈ వ్యాజ్యాలపై ఇరువురు సింగిల్ జడ్జీలు రెండు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీనిపై మెట్రో వర్గాలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారుు. వీటిపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. పరిహారం చెల్లింపునకు దాన్ని నిర్ణరుుంచిన తేదీనే ప్రామాణికమని ధర్మాసనం స్పష్టం చేసింది. అరుుతే భూ యజమానుల్లో అత్యధికులకు ఇప్పటివరకు పరిహారం చెల్లించనందున వారికి 2013 భూసేకరణ చట్టం కిందే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక పాత తేదీలతో పరిహార ఉత్తర్వులు జారీ చేశారన్న ఓ సింగిల్ జడ్జి అభిప్రాయంతో ధర్మాసనం విబేధించింది.