ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి జూన్ మూడోవారంలో భూమిపూజ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరులోగా క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్ ఇవ్వనుంది. మే 14న ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ప్రభుత్వం భూసేకరణ నోటీసు జారీ చేయనుంది.
ఇప్పటివరకు 11,300 ఎకరాల భూములకు సంబంధించిన రైతులతో సీఆర్డీఏ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ నెలాఖరులోగా మొత్తం 33 వేల ఎకరాలకు సంబంధించి అగ్రిమెంట్లు పూర్తిచేయాలని సీఆర్డీఏకు ప్రభుత్వం లక్ష్యం విధించింది. అయితే, 6 వేల ఎకరాలకు సంబంధించిన రైతులు మాత్రం 9.2 ఫారాల ద్వారా తమ అభ్యంతరాలు తెలిపారు.
జూన్లో రాజధానికి భూమిపూజ
Published Tue, May 5 2015 6:55 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
Advertisement
Advertisement