
27న శివరామకృష్ణన్ నివేదిక: నారాయణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఎంపికకు సంబంధించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ నెల 27వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించే అవకాశముందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించేందుకు దేశంలోని కొత్తగా నిర్మితమైన రాజధానులను ఈ నెలాఖరులో సందర్శించాలని నిర్ణయించామని సోమవారం చెప్పారు.
వచ్చే నెలలో టీటీడీ కమిటీ: మంత్రి మాణిక్యాలరావు
వచ్చే నెల రెండో వారంలోగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేయనున్నామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలి పారు. టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటుచేసే యోచనే లేదని స్పష్టంచేశారు. టీటీడీ ట్రస్టు బోర్డులో ఇలా 17 మందితో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యునిగా మరో సభ్యున్ని నియమిస్తామని వివరించారు.