
నేడు రాజధానిలో పవన్ పర్యటన
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం బలవంతంగా భూమి సేకరించనున్న ప్రాంతాల్లో ఆదివారం జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టదలచిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు.
తాజా పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే ప్రాంతాలైన ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. గతంలో కూడా పవన్ రాజధాని ప్రాంతాలను సంద ర్శించారు. పర్యటన అనంతరం పవన్ హైదరాబాద్‌కు వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను కలసి భూసేకరణ తీరును వివరించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.