* రాజధాని ప్రాంత అభివృద్ధి మండలికి చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీ సమావేశాలు * పలు సవరణలతో సీఆర్‌డీఏ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం * శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి తక్షణమే ఆమోదం పొందాలని నిర్ణయం * సీఎం చైర్మన్‌గా 15 మందితో సీఆర్‌డీఏ.. 9 మంది అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీ * ఎయిడెడ్ టీచర్ల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు.. యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి 62 ఏళ్లకు పెంపు