ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి విడుదలచేసిన మాస్టర్‌ప్లాన్‌పై మంగళవారం ఉండవల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ల్యాండ్ పూలింగ్‌కు 85 శాతం మంది రైతులు వ్యతిరేకించిన ఉండవల్లిలో మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు ఎందుకు నిర్వహించారని రైతులు డీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను నిలదీశారు.
ఊరి మధ్యనుంచి రోడ్లు నిర్మించేది లేదని, గ్రామ కంఠాలలో కూడా రోడ్డు వేయమని, రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమికి రెట్టింపు భూమి రైతులకు ఇవ్వడంతో పాటు మార్కెట్ ధర చెల్లిస్తామని శ్రీకాంత్ నచ్చజెప్పారు. అయినా రైతులు శాంతించలేదు. రాజధాని నిర్మాణానికి తాము భూములు ఇచ్చే సమస్యే లేదని రైతులు తెగేసి చెప్పి సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. దాదాపు రెండు గంటలపాటు కమిషనర్ శ్రీకాంత్ నచ్చజెప్పినా రైతులు వినలేదు. ఉండవల్లిలో ఎకరా భూమి రెండు కోట్ల రూపాయలు పలుకుతోందని, మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తామంటే ఆలోచిస్తామని కొందరు రైతులు స్పష్టంచేశారు.
భూసేకరణపై ఉండవల్లి రైతుల ఆందోళన
Published Tue, Jan 19 2016 1:07 PM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM
Advertisement
Advertisement