
పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు అయింది. ప్రకాశం బ్యారేజీ మీదుగా ఆయన ఆదివారం ఉండవల్లి చేరుకోనున్నారు. ఉండవల్లి ప్రాథమిక పాఠశాలలో రైతులతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు. అనంతరం పెనుమాక మీదగా బేతపూడి వెళ్లనున్నారు.
భూ సేకరణ అమలును పవన్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ రాజధాని కోసం ఇంకా సేకరించాల్సిన భూమి విషయంలో 'భూసేకరణ చట్టాన్ని' వినియోగించవద్దని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నది పరివాహక గ్రామాల రైతులను కలుస్తానని ఆయన రెండు రోజుల క్రితం ట్విట్టర్లో పేర్కొన్నారు.