మంగళగిరి (గుంటూరు): రాజధాని పరిధిలోని పలు గ్రామాల్లో పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ శుక్రవారం పర్యటించారు. సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో కలసి మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. గ్రామ కంఠాల నిర్ణయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామ సరిహద్దులను నిర్ణయించి, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఈ సందర్భంగా మంత్రి నారాయణ సూచించారు.