జనవరి 13న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఎంఐజీ లేఅవుట్‌ ప్రారంభం  | CM YS Jagan May Launch MIG Layout January 13th | Sakshi
Sakshi News home page

జనవరి 13న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఎంఐజీ లేఅవుట్‌ ప్రారంభం  

Published Fri, Jan 7 2022 4:32 AM | Last Updated on Fri, Jan 7 2022 9:31 AM

CM YS Jagan May Launch MIG Layout January 13th - Sakshi

సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సమీపంలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లోని ఎంఐజీ లే అవుట్‌ను ఈ నెల 13న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ విజయకృష్ణన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 200 నుంచి 240 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ ప్లాట్లను పొందేందుకు రూ.18 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న ఏపీకి చెందిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement