capital area
-
తాలిబన్ల చెరలో జరాంజ్‌నగరం
కాబూల్: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా, యూరప్ దేశాల సేనలు వెనక్కి మళ్లడం మొదలైన తర్వాత తాలిబన్లకు అడ్డే లేకుండా పోయింది. దేశంలో క్రమంగా ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే 70% భూభాగం ముష్కరుల పెత్తనం కిందకు వచ్చేసింది. తాజాగా నిమ్రోజ్ ప్రావిన్షియల్ రాజధాని జెరాంజ్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ గవర్నర్ రోహ్ గుల్ జైర్జాద్ శుక్రవారం స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అఫ్గాన్ నుంచి విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ మొదలైన తర్వాత తాలిబన్లు ఒక ప్రావిన్షియల్ రాజధానిని చెరపట్టడం ఇదే మొదటిసారి. దేశంలో ప్రధాన నగరాలను కాపాడడానికి ప్రభుత్వ దళా లు అష్టకష్టాలు పడుతున్నాయి. తాజా ఘటనతో అఫ్గాన్ సైనికుల ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. ఇరాన్ సరిహద్దుల్లోని జరాంజ్ నగరం ఎలాంటి ప్రతిఘటన లేకుం డానే తాలిబన్ల వశమయ్యింది. ఇక్కడ 50 వేల కుపైగా జనాభా నివసిస్తోంది. తీవ్రవాదులు జరాం జ్ వీధుల్లో వీర విహారం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీరి రాకతో స్థాని కులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ మీడియా చీఫ్ కాల్చివేత అఫ్గానిస్తాన్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ డైరెక్టర్‌ను తాలిబన్లు కాల్చి చంపారు. అఫ్గాన్ తాత్కాలిక రక్షణ మంత్రిపై హత్యాయత్నానికి తెగించిన కొన్ని రోజులకే ఈ ఘటనకు పాల్పడ్డారు. రాజధాని కాబూల్‌లోనే మీడియా సెంటర్ డైరెక్టర్‌ను తాలిబన్లు చంపేయడం చర్చనీయాంశంగా మారింది. తాలిబన్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ..‘‘మా ముజాహిదీన్ల కాల్పుల్లో ప్రభుత్వ మీడియా సెంటర్ డైరెక్టర్ దావాఖాన్ మెనపాల్ మృతి చెందారు’ అని పేర్కొన్నారు. -
రాజధాని ప్రాంతంలో బాబుగారి కొండచిలువ
నాగార్జున వర్సిటీకి ఎదురుగా బ్యాంకు తనఖాలో ఉన్న 6.19 ఎకరాల భూమి ఇది. రాష్ట్ర విభజనకు ముందు 2014లో దీని విలువ రూ. 35.59 కోట్లుగా లెక్కకట్టారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 102 కోట్లు కానీ ఈ స్థలాన్ని కేవలం రూ.33 కోట్లకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. కొసమెరుపు: ఈ చిత్రంలోని బహుళ అంతస్తుల భవనాలు, ఐజేఎం– లింగమనేని.. రెయిన్‌ట్రీ పార్కుకు చెందినవి కావటం గమనార్హం. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజధాని ప్రాంతంలోని భూములను అధికారపార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు కొండచిలువల్లా మింగేస్తున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచీ వారు పేట్రేగిపోతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోతున్నారు. చిన్న, సన్నకారు రైతులు వద్ద నుంచి తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారమే ప్రధాన ధ్యేయంగా సాగిపోతున్న వారిలో ఇప్పుడు మరో కోణం బయటపడింది. పరోక్షంగా ముఖ్యనేత, ఓ కీలక మంత్రి.. ప్రత్యక్షంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లింగమనేని గ్రూప్ ఈ దందా కొనసాగిస్తోంది. తనఖాలో ఉన్న విలువైన భూములే లక్ష్యంగా ఎంపిక చేసుకుని, నయానో, భయానో, అధికార బలంతోనే వాటిని లాగేసుకుని తమ రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. రాజధాని, విజయవాడ, గుంటూరు నగరాలకు సమీపంలో వాణిజ్య పరంగా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన భూములను చేజిక్కించుకోవడానికి బ్యాంకర్లను పావులుగా వాడుకుంటున్నారు. రుణం తీర్చేస్తామని తనఖా పెట్టిన వారు మొత్తుకుంటున్నా వినకుండా ఆ భూములను లింగమనేని అండ్‌కోకు తక్కువ ధరకే కట్టబెట్టేలా ప్రణాళికలు వేస్తున్నారు. దీనికోసం నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. తనఖాలోని భూములే లక్ష్యంగా.. బ్యాంకుల్లో రుణం తీసుకోవాలంటే ఆస్తులను తనఖా పెట్టాల్సిందేనన్న విషయం తెలిసిందే. గడువులోగా రుణం చెల్లించకపోతే బ్యాంకర్లు నోటీసులు ఇస్తారు. వాటికి స్పందించకపోతే ఆ రుణాన్ని నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా ప్రకటించి.. ఆస్తులను వేలం వేసి, వచ్చిన డబ్బులో తామిచ్చిన రుణాన్ని మినహామించుకుని మిగిలిన సొమ్మును తనఖా పెట్టిన వారికి ఇవ్వడం రివాజు. అయితే నోటీసులు ఇచ్చినప్పుడు రుణం తీసుకున్న వారు వడ్డీ చెల్లించినా, గడువు కోరినా, ఇతర సెక్యూరిటీలు చూపడానికి సిద్ధమైనా ఆస్తులను వేలం వేయకూడదు. అలాగే ఒన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)కు రుణగ్రహీత సిద్ధపడితే ఆ అవకాశాన్ని కూడా పరిశీలించాలి. కానీ, రాజధాని ప్రాంతంలో విలువైన భూముల వేలం విషయంలో బ్యాంకర్లు నిబంధనలను పాటించడం లేదు. ఆ భూములను లింగమనేనికి కట్టబెట్టడానికే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యనేతతో పాటు లింగమనేనితో ఆర్థిక లావాదేవీలు ఉన్న ఓ మంత్రి కూడా ఒత్తిడి చేస్తుండటంతో బ్యాంకర్లు ఈ పనికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలంలో తక్కువకు పాడినా.. వ్యాపార అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ 2014లో బంజరాహిల్స్‌లోని సిండికేట్ బ్యాంక్‌ను రుణం కోసం ఆశ్రయించింది. గుంటూరు జిల్లా చినకాకానిలో సర్వే నంబర్లు 230, 231ఏల్లో తనకున్న 3 ఎకరాల భూమిని ఆ కంపెనీ సెక్యూరిటీగా చూపింది. బ్యాంకు అధికారులు ఈ భూమి విలువను 2014 జూన్ 6న రూ.19.50 కోట్లు, అదే నెల 19న రూ. 20.25 కోట్లు, 2018 మార్చి 20న రూ. 24.75 కోట్లుగా అంచనా వేశారు. 2014 విలువ ఆధారంగా బ్యాంక్ అధికారులు రూ. 9 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. అయితే మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా ఆ కంపెనీ వ్యాపారం సక్రమంగా సాగలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు రూ. 36.37 లక్షల వడ్డీని చెల్లించాలని కోరడంతో, ఆ కంపెనీ వెంటనే రూ. 20 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసింది. తమ 3 ఎకరాల భూమి అభివృద్ధి నిమిత్తం మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, అప్పు మొత్తాన్ని త్వరలో చెల్లించేస్తామని బ్యాంకుకు తెలిపింది. ఈ భూమిపై లింగమనేని అండ్ కో కన్ను పడింది. ఆ భూమికి పక్కనే లింగమనేని సంస్థకు పది ఎకరాల భూమి కూడా ఉంది. కంపెనీ భూమితో కలుపుకొని 13 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసి వందలాది కోట్ల రూపాయలు గడించడానికి ముఖ్యనేత, ఓ మంత్రితో లింగమనేని వ్యూహం రచించారు. అధికారంలోని ముఖ్య నేతలతో బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చారు. దీంతో నిబంధనలు తుంగలో తొక్కి బ్యాంకర్లు ఆ మూడు ఎకరాలను వేలం వేసేశారు. అయితే బ్యాంకుకు రావాల్సిన మొత్తం బకాయిల్ని రాబట్టుకునే ప్రయత్నాలు కూడా సజావుగా చేయలేదు. బ్యాంకుకు మొత్తం రూ.11.87 కోట్లు రావాల్సి ఉండగా, రూ.10.85 కోట్లకే వేలం పాడిన లింగమనేని అండ్ కోకి ఆ భూమిని కట్టబెట్టేశారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ. 50 కోట్లకుపైగా ఉంటుందని బ్యాంకు ఉద్యోగులే చెబుతుండటం గమనార్హం. దీనిపై డెట్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాద్‌లో పిటిషన్ దాఖలవ్వగా.. వేలం పాడిన వారు ఈ ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు జరపరాదనే ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. రుణం చెల్లిస్తామన్నా వేలమే.. హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ స్పిన్నింగ్ మిల్లు కొనుగోలు కోసం 2014లో సిండికేట్ బ్యాంకు, ఒంగోలు బ్రాంచ్‌లో రూ.31.75 కోట్ల రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇందుకు ప్రకాశం జిల్లా, దొడ్డవరప్పాడులోని 27.25 ఎకరాలను ప్రధాన హామీగా ఉంచింది. ఈ భూమి విలువను 2014లో రూ.26.01 కోట్లుగా, ప్లాంట్, మిషనరీని రూ.15 కోట్లుగా నిర్ణయించారు. అలాగే అదనపు హామీ (కొల్లేటరల్ సెక్యూరిటీ)గా గుంటూరు–విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా సర్వే నంబర్ 213/ఎ, 214లో ఉన్న 6.19 ఎకరాల భూమిని చూపారు. దీని విలువను బ్యాంకు 2014లో రాష్ట్ర విభజనకు ముందు రూ. 35.59 కోట్లుగా లెక్కగట్టింది. అలాగే రూ.13.13 కోట్లకు వ్యక్తిగత పూచీకత్తు, రూ.42 కోట్లకు కార్పొరేట్ గ్యారెంటీని కూడా కంపెనీ ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ప్రాంతాన్ని ప్రకటించిన తరువాత అదనపు హామీగా ఉంచిన భూమి విలువ భారీగా పెరిగింది. 2015 జూన్‌లో ఆ భూమి విలువ రూ.75 కోట్లుగా అంచనా వేశారు. గతంలో విలువ నిర్ణయించిన వాల్యూయరే ఈ విలువను కూడా లెక్కగట్టారు. అయితే రుణ వాయిదాలను సక్రమంగా చెల్లించడంలేదంటూ 2016 ఫిబ్రవరి 18న కంపెనీకి సిండికేట్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఆ రుణాన్ని నిరర్థక ఆస్తిగా పరిగణించింది. రుణం మొత్తాన్ని చెల్లించే స్థోమత తమకుందని చెప్పి రూ. 10 కోట్లు చెల్లించింది. మిగిలిన రుణం చెల్లించేందుకు కొంత గడువు ఇవ్వాలని బ్యాంకును కంపెనీ కోరింది. అయితే ఇక్కడ కూడా లింగమనేని అండ్ కో ఎంటరైంది. ఈ భూమికి రెండు వైపుల లింగమనేనికి భూములు ఉండటంతో తక్కువ ధరకే కంపెనీ భూములు కొట్టేసేందుకు ఎత్తు వేశారు. లింగమనేనికి అండగా ముఖ్యనేత, ఓ మంత్రి రంగంలోకి దిగి ఆ భూమిని వేలం వేయాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రధాన ఆస్తితో పాటు అదనపు హామీగా ఉంచిన భూమి వేలానికి బ్యాంకు నిర్ణయం తీసుకుంది. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉన్న భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.102 కోట్లు ఉండగా దానిని రూ. 33 కోట్లకే విక్రయించడానికి నిర్ణయించినట్లు బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. వాస్తవానికి వేలానికి ముందు సదరు ఆస్తి విలువను తప్పనిసరిగా మదింపు చేయాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంది. ఆ పని చేయకుండా అతి తక్కువ ధరకు లింగమనేనికే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. కాగా ప్రధాన హామీగా ఉంచిన ప్రకాశం జిల్లా, దొడ్డవరప్పాడులోని 27.25 ఎకరాలను, ప్లాంట్, మిషనరీ గురించి బ్యాంకర్లు దృష్టి సారించకపోవడం గమనార్హం. -
రాజాధానిలో టీడీపీ రాక్షస క్రీడ
-
రాజధానిలో పచ్చనేతల రాక్షసానందం
-
రాజధాని ప్రాంతంలో మళ్లీ భూసేకరణ
-
ఏపీ రాజధాని ప్రాంతంలో స్వల్ప మార్పులు
హైదరాబాద్: నవ్యాంధ్ర క్యాపిటల్ రీజియన్ స్వరూపాన్ని ఏపీ సర్కార్ కాస్త మార్చేసింది. సీఆర్డీఏ పరిధి 7,068 చ.కి.మీ నుంచి 8,352 చ.కి.మీటర్లకు ప్రభుత్వం పెంచేసింది. కొత్తగా 1,400 చ.కి.మీ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏలో కలిపింది. గతంలో పేర్కొన్న ప్రాంతంలో 116 చ.కి.మీ ప్రాంతాన్ని రాజధాని ప్రాంత పరిధి నుంచి తప్పించింది. సీఆర్డీఏ నుంచి తప్పించిన ప్రాంతాలు ఇవే: అంగలూరు, ఉడ్లవల్లేరు, వేముకుంట, కల్వపూడి, చిత్రం, పెంజేంద్ర, గొరిజవోలుగుంటపాలెం, నాదెండ్ల, మదల -
రాజధాని ప్రాంతాల్లో 144 సెక్షన్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పరిసర ప్రాంతమైన గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో శనివారం నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. అనుమతుల్లేకుండా సభలు, సమావేశాలు జరపకూడదని పోలీసులు అక్కడి వారికి ఆదేశించారు. కౌలు చెల్లింపులు, కూలీలకు పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగక సీఆర్డీఏ ఎదుట తరచూ ఆందోళనలు జరుగుతుండడం.. ఉండవల్లిలోనే సీఎం రెస్ట్ హౌస్ ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆందోళనకారులు సీఎం ఇంటిని ముట్టడిస్తారన్న భయంతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. -
నేడు రాజధానిలో చైనా బృందం సర్వే
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర రాజధాని ప్రాంతంలో గురువారం చైనా ప్రతినిధి బృందం సర్వే నిర్వహించనుంది. ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని గేట్‌వే హోటల్లో అధికారులతో సమావేశమవుతారు. కలెక్టర్ బాబు ఈ సమావేశంలో పాల్గొంటారు. చైనా ప్రతినిధులు రోడ్డుమార్గంలో పర్యటిస్తారా? లేక హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారా అనేది నిర్ధారణ కాలేదు. రాజధాని ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంటుందనే వివరాలు, ఇతర కార్యాలయాల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని వారికి కలెక్టర్ తెలియజేస్తారు. నేటి రాత్రి బెజవాడలో సీఎం బస సీఎం చంద్రబాబు గురువారం రాత్రి విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలో ఉన్న క్యాంపు కార్యాలయంలో బస చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి గురువారం రాత్రి 7.30 గంటలకు గన్నవరం వస్తారు. -
బాబోయ్ ..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిక్కుకోవడం నవ్యాంధ్ర రాజ ధాని నిర్మాణంపై ప్రభావ ం చూపుతోంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, స్థలాలను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు, తాజా రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో బాబు చిక్కుకుంటే తమ జీవితాలు తారుమారు అవుతాయనే ఆందోళన వారిలో కనపడుతోంది. టీడీపీ నాయకులు ఎవరు ఎదురైనా దీనిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ ఏసీబీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? సీఎం అరెస్టు అవుతారా? తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు ఖరీఫ్‌కు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు సేకరణ, మెట్ట దుక్కులు దున్నుకోవడం వంటి పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే 33,347 ఎకరాల భూ సమీకరణ చేసిన ప్రభుత్వం 22 వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు కౌలు డీడీలు పంపిణీ చేసింది. ఆరువేల ఎకరాలకు సంబంధించి కౌలు డీడీలు ఇవ్వడానికి కొన్ని సమస్యలు ఎదురవడంతో వాటిని పెండింగ్‌లో పెట్టారు. మిగిలిన 5 వేల ఎకరాలకు సంబంధించి మారిన రాజకీయ నేపథ్యంలో రైతులు కౌలు డీడీలు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు. ఓటుకు నోటులో సీఎం పాత్ర ఉందని రుజువైతే, రాజధాని నిర్మాణం ఆగిపోయినట్టేనని రైతులు అంటున్నారు. దీంతో తమ భూములను తిరిగి తామే సాగుచేసు కోవాలనుకొంటున్నారు. ఈ వివాదం వల్ల రాజధాని నిర్మాణానికి కొన్ని నెలలు ఆటంకం ఏర్పడే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో రైతులు రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. భూమిపూజ అనంతరం నేటి వరకు మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ రాజధాని ప్రాంతంలో పర్యటించకపోవటం రైతుల్లో ఉన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. రియల్టర్లకు అడుగడుగునా ఆటంకాలు ... జిల్లాలోని రియల్టర్లకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు రాజధాని గ్రామాల్లోని స్థలాలు, భూములు రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపి వేసింది. గ్రామకంఠంకు అర కిలోమీటరు పరిధిలోని స్థలాలకే ప్లాన్ ఇవ్వాలని, అర కిలోమీటరు పరిధి దాటిన లే-అవుట్లకు అనుమతి ఇవ్వవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ఈ ప్రాంతంలో రావడంతో భూముల ధరలు అనూహ్యంగా పెరుగుతా యని, స్థలాలు, అపార్టుమెంట్ల నిర్మాణాలు పెరుగుతాయని మొదటి నుంచి రియల్టర్లు భావించారు. అయితే తరచూ ఏదో ఆటంకం ఎదురుకావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగడం లేదు. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఓటుకు నోటు వివాదంలో సీఎం చిక్కుకోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. వ్యవసాయ కార్మికుల వలస ... రాజధాని గ్రామాల్లో వ్యవసాయ పనులు జరిగే అవకాశాలు లేకపోవడంతో వ్యవసాయ కార్మికులు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు వలస వెళుతున్నారు. ఆ జిల్లాల్లో వ్యవసాయ పనులు ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో అక్కడికి వెళుతున్నారు. -
రాజధాని పరిధిలో మంత్రి నారాయణ పర్యటన
మంగళగిరి (గుంటూరు): రాజధాని పరిధిలోని పలు గ్రామాల్లో పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ శుక్రవారం పర్యటించారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో కలసి మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. గ్రామ కంఠాల నిర్ణయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామ సరిహద్దులను నిర్ణయించి, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఈ సందర్భంగా మంత్రి నారాయణ సూచించారు. -
ఇక 3 ముక్కలు.. 6 నోట్లు
♦ జూద నిలయం కానున్న రాజధాని ప్రాంతం ♦ పేకాట క్లబ్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధం ♦ మూతపడిన క్లబ్‌లను లీజుకు తీసుకుంటున్న అనంతపురం జిల్లా దేశం నేత ♦ స్థానిక పోలీసుల ఒత్తిళ్లు లేకుండా పై స్థాయి సిఫార్సులు సాక్షి, గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్ నూత న రాజధానిని అత్యాధునిక హంగులతో సింగపూర్ తరహాలో నిర్మిస్తామంటున్న అధికార పార్టీ నేతలు అక్కడి తరహాలో విచ్చలవిడి జూదాన్ని కూడా ఇక్కడ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజధాని నగరంగా రూపుదిద్దుకోనున్న గుంటూరుజిల్లాతోపాటు, సమీపంలోని కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పేకాట క్లబ్‌లుగా ఒక వెలుగు వెలిగి కొన్నేళ్లుగా మూతపడిన క్లబ్‌లను లీజుకు తీసుకుని అందులో పేకాట నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. దీనికి అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తనకు సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ పోలీసు అధికారి ద్వారా హైదరాబాద్ స్థాయిలో పైరవీలు సాగిస్తున్నట్లు తెలిసింది. క్లబ్‌లు ఉండే ప్రాంతాల్లో ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధుల సహకారంతో వారిని భాగస్తులుగా చేసుకుని క్లబ్బుల్లో పేకాట నిర్వహించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే ఆలోచనలో ఉన్న సీమనేత రెండు నెలలుగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బినామీలతో క్లబ్‌లను లీజుకు తీసుకునేలా చేసి స్థానిక పోలీసుల ఒత్తిడి లేకుండా పైస్థాయి అధికారులతో చెప్పించుకుని యథేచ్చగా జూదం నిర్వహించాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. కార్డ్స రూమ్‌ల ఏర్పాటు.. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొంతకాలంగా మూతపడి ఉన్న మూడు క్లబ్‌లను వేర్వేరు పేర్లతో రెండు నెలల క్రితం లీజుకు తీసుకుని అందులో కార్డ్స్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండే ఓ క్లబ్‌ను విజయవాడకు చెందిన టీడీపీ నేతలతో లీజుకు తీసుకునేలా చేసి అతి త్వరలో ఆ క్లబ్లో పేకాట ఆడించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ క్లబ్‌కు పంచాయతీ నుంచి ఎన్వోసీ ఇచ్చేందుకు టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో 2006 నుంచి మూతపడి ఉన్న నార్త్క్లబ్ను తెరిచి అందులో పేకాట ఆడిస్తున్నారు. క్లబ్ స్థాపించిన కుటుంబీకుల్లో ఇద్దరు ఈ విషయాన్ని అర్బన్‌ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫిర్యాదు చేయడంతో గురువారం రాత్రి గుంటూరు వెస్ట్ ఏఎస్పీ వెంకటప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు క్లబ్‌పై దాడులు చేసి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 54 వేలు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి ఒక్కో క్లబ్లో ఒక్కో సమయంలో పేకాటను ప్రారంభిస్తూ నెలరోజుల్లో అన్ని క్లబ్‌లు కళకళలాడేలా చేయాలనేది వీరి ప్రయత్నం. పేకాటకు పూర్వ వైభవం.. గుంటూరు రూరల్ జిల్లాపరిధిలోని చిలకలూరిపేట పట్టణంలో గత ఏడాది మూతబడిన ఓ క్లబ్‌ను తిరిగి తెరిపించి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మళ్లీ పాతరోజులు గుర్తుకు తెచ్చేలా పేకాట నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా సదరు క్లబ్ సభ్యులంతా గురువారం రాత్రి క్లబ్లో సమావేశమై దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కృష్ణా జిల్లా ఆరిగిరిపల్లి వద్ద ఉన్న ఓ క్లబ్ కొన్నేళ్లుగా మూతపడి ఉంది. దీన్ని సైతం నెల క్రితం తెరిచి అనంతపురం ప్రజాప్రతినిధితోపాటు, విజయవాడ నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కలిసి, నిర్వహించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉన్న క్లబ్లో సైతం పేకాట నిర్వహించేందుకు సీమనేత తీవ్రస్థాయిలో పైరవీలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాజధాని ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పేకాట క్లబ్‌లు ఏర్పాటు చేసి, ధనార్జనే ధ్యేయంగా అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆలోచన సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులే జూదాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తుండటంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
రేపు రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటన
మంగళగిరి (గుంటూరు) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల మూడో తేదీన రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌లు ఆయన పర్యటన వివరాలను ఆదివారం వెల్లడించారు. జగన్మోహన్రెడ్డి మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అక్కడ రైతులు, రైతు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు నగరానికి చేరుకుంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి అక్కడి నుంచి హైదరాబాద్ వెళతారని నేతలు వివరించారు. రైతులకు భరోసా కల్పించేందుకే... రైతులకు, రైతు కూలీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పార్టీ నేతలు తెలిపారు. దీనిలో భాగంగా రైతుల్లో భరోసా కల్పించి వారి సాదకబాధకాలు తెలుసుకోవటానికే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని వారు వివరించారు. రైతులు, రైతు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నట్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని వ్యవహారంలో రైతులకు అండగా నిలిచిందని, ఇప్పటికే పలు దఫాలుగా తమ పార్టీ నేతలు, రైతు సంఘ నాయకులు, పార్టీ ప్రతినిధి బృందం, శాసనసభాపక్ష బృందం ఈ ప్రాంతంలో పర్యటించాయని చెప్పారు. తద్వారా ఎప్పటికప్పుడు రాజధాని ప్రాంతంలోని ఇబ్బందులు, సమస్యలను పార్టీ నేతలు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, ఆయన సంబంధిత అధికారులతో, పార్టీ నాయకులతో మాట్లాడి రైతులకు అండగా నిలిచారని వివరించారు. రాజధాని ప్రాంతంలో రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారిలో ధైర్యం నింపేలా జగన్ పర్యటన సాగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణంపై తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ విషయాన్ని అసెంబ్లీలోనే పార్టీ అధినేత జగన్ ప్రకటించారని చెప్పారు. అయితే రాజధాని నిర్మాణ క్రమంలో రైతులు, రైతుకూలీల ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా చూడాలని మొదటినుంచీ తాము డిమాండ్ చేస్తున్నామని వివరించారు. -
ఫోర్త్ ఎస్టేట్ : నాగలికి సంకెళ్ళు!
-
రైతుల సమస్యల పై గవర్నర్‌కు వైఎస్ఆర్ సీపీ పిర్యాదు
-
మంత్రులతో చంద్రబాబు సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో సమావేశమయ్యారు. సోమవారం సెక్రటేరియట్లో ఈ భేటీ జరుగుతోంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తున్న రైతులకు ఎంత పరిహారం ఇవ్వాలన్న విషయంపై చంద్రబాబు చర్చిస్తారు. రాజధాని భూసేకరణ ప్రాంత రైతులతో కూడా చంద్రబాబు ఈ రోజు సమావేశమై పరిహారాన్ని ప్రకటించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించనున్నారు. -
నేడు రాజధాని ప్రాంత రైతులకు పరిహారం ప్రకటన
-
నేడు రాజధాని ప్రాంత రైతులకు పరిహారం ప్రకటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో రాజధాని భూసేకరణ ప్రాంత రైతులతో సమావేశంకానున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎంత పరిహారం ఇవ్వాలన్న విషయాన్ని చంద్రబాబు ప్రకటించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇటీవల తుళ్లూరు మండలం రైతులతో సమావేశమయ్యారు. మంత్రి వర్గం ఉపసంఘంలోనూ ఈ విషయంపై చర్చించారు. తాజాగా మరోసారి రైతులతో సమావేశమై పరిహారం ప్రకటించనున్నారు.