గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పరిసర ప్రాంతమైన గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో శనివారం నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. అనుమతుల్లేకుండా సభలు, సమావేశాలు జరపకూడదని పోలీసులు అక్కడి వారికి ఆదేశించారు. కౌలు చెల్లింపులు, కూలీలకు పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగక సీఆర్డీఏ ఎదుట తరచూ ఆందోళనలు జరుగుతుండడం.. ఉండవల్లిలోనే సీఎం రెస్ట్ హౌస్ ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆందోళనకారులు సీఎం ఇంటిని ముట్టడిస్తారన్న భయంతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.