ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో రాజధాని భూసేకరణ ప్రాంత రైతులతో సమావేశంకానున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో రాజధాని భూసేకరణ ప్రాంత రైతులతో సమావేశంకానున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎంత పరిహారం ఇవ్వాలన్న విషయాన్ని చంద్రబాబు ప్రకటించనున్నారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇటీవల తుళ్లూరు మండలం రైతులతో సమావేశమయ్యారు. మంత్రి వర్గం ఉపసంఘంలోనూ ఈ విషయంపై చర్చించారు. తాజాగా మరోసారి రైతులతో సమావేశమై పరిహారం ప్రకటించనున్నారు.