'రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది' | cpi rama krishna takes over andhra pradesh sarkar | Sakshi
Sakshi News home page

'రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది'

Published Mon, Dec 29 2014 12:13 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

'రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది' - Sakshi

'రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది'

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.ప్రస్తుతం రైతులు దయనీయ పరిస్థితులో ఉన్నారని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ.. అగ్ని ప్రమాద ఘటనలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.


రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభీత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు. దీంతో చంద్రబాబు సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement