brunt
-
జై ముంబై
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో సారి జయకేతనం ఎగురవేసింది. రెండేళ్ల క్రితం టోర్నీ తొలి విజేతగా నిలిచిన జట్టు ఇప్పుడు మళ్లీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఢిల్లీతో తుది పోరులో తక్కువ స్కోరుకే పరిమితమైనా... పట్టుదల, సమష్టితత్వంతో ఆడిన జట్టు లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఆల్‌రౌండర్ నాట్ సివర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ ఆఖరి పోరులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ బృందం విషాదంలో మునిగిపోయింది. వరుసగా మూడు సీజన్ల పాటు గ్రూప్‌లో టాపర్... వరుసగా మూడు ఫైనల్ మ్యాచ్‌లు... మూడింటిలోనూ పరాజయాలు. ఛేదనలో 17 పరుగులకే ఇద్దరు టాప్ బ్యాటర్లను కోల్పోయిన తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆ తర్వాత కొంత పోరాడినా లాభం లేకపోయింది. ముంబై: డబ్ల్యూపీఎల్ సీజన్–3లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 8 పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించగా, నికీ ప్రసాద్ (23 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. 523 పరుగులు చేసి 12 వికెట్లు తీసిన నాట్ సివర్ బ్రంట్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.మరిజాన్ కాప్ తన వరుస ఓవర్లలో హేలీ మాథ్యూస్ (3), యస్తిక భాటియా (3)లను వెనక్కి పంపడంతో ముంబై ఒత్తిడిలో పడింది. అయితే సివర్, హర్మన్ కలిసి దూకుడుగా ఆడారు. సదర్లాండ్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన హర్మన్...జొనాసెన్ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదింది. 33 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తయింది. వీరిద్దరి భాగస్వామ్యం తర్వాత ముంబై తడపడింది. 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఛేదనలో ఢిల్లీ అవకాశాలన్నీ ఓపెనింగ్ భాగస్వామ్యంపైనే ఉన్నాయి. అయితే ఫామ్‌లో ఉన్న లానింగ్ (13), షఫాలీ (4) రెండు పరుగుల తేడాతో వెనుదిరగడంతో జట్టు స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. మధ్యలో జెమీమా కొంత జోరుగా ఆడే ప్రయత్నం చేసినా చేయాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయి చేయిదాటిపోయింది. మరిజాన్ కాప్ ప్రయత్నం కూడా వృథా అయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) జెమీమా (బి) కాప్ 8; హేలీ (బి) కాప్ 3; నాట్సివర్ (సి) మణి (బి) చరణి 30; హర్మన్‌ప్రీత్ (సి) కాప్ (బి) సదర్లాండ్ 66; కెర్ (సి) షఫాలీ (బి) జొనాసెన్ 2; సజన (ఎల్బీ) (బి) జొనాసెన్ 0; కమలిని (స్టంప్డ్) బ్రైస్ (బి) చరణి 10; అమన్‌జోత్ (నాటౌట్) 14; సంస్కృతి (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–103, 4–112, 5–112, 6–118, 7–132. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–11–2, శిఖా పాండే 4–0–29–0, అనాబెల్ సదర్లాండ్ 4–0–29–1, జొనాసెన్ 3–0–26–2, శ్రీ చరణి 4–0–43–2, మిన్ను మణి 1–0–10–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) సివర్ 13; షఫాలీ (ఎల్బీ) (బి) షబ్నమ్ 4; జెస్ జాన్సన్ (సి) యస్తిక (బి) కెర్ 13; జెమీమా (సి అండ్ బి) కెర్ 30; అనాబెల్ (స్టంప్డ్) యస్తిక (బి) సైకా 2; మరిజాన్ కాప్ (సి) హేలీ (బి) సివర్ 40; సారా (రనౌట్) 5; నికీ (నాటౌట్)25; శిఖ (బి) సివర్ 0; మిన్ను మణి (సి) సజన (బి) హేలీ 4; శ్రీ చరణి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–15, 2–17, 3–37, 4–44, 5–66, 6–83, 7–123, 8–123, 9–128. బౌలింగ్: షబ్నమ్ ఇస్మాయిల్ 4–0–15–1; నాట్సివర్ బ్రంట్ 4–0–30–3; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–25–2; సైకా 4–0–33–1. -
శివమెత్తిన సివర్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్లతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. నాట్ సివర్ బ్రంట్ (75 నాటౌట్; 3 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. గత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై సూపర్ ఓవర్లో నెగ్గిన యూపీ వారియర్స్... ఈ మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకు పరిమితమైంది. గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), దినేశ్ వృందా (30 బంతుల్లో 33; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. కెప్టెన్ దీప్తి శర్మ (4), కిరణ్ నవగిరె (1), తాలియా మెక్‌గ్రాత్ (1), షినెల్ హెన్రీ (7) విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో సివర్ బ్రంట్ 3 వికెట్లు... షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సివర్ బ్రంట్ (44 బంతుల్లో 75 నాటౌట్; 13 ఫోర్లు), హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. యూపీ బౌలర్లు సైమా, షినెల్ హెన్రీ, సోఫీ ఎకిల్‌స్టోన్ ఓవర్లలో సివర్ మూడు బౌండరీల చొప్పున కొట్టింది. రెండో వికెట్‌కు హేలీ, సీవర్ 133 పరుగులు జోడించి ముంబై జట్టుకు అలవోక విజయాన్ని అందించారు. సివర్ బ్రంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ ఆడనుంది. -
ఐదేళ్ల దోస్తానా! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు
ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్లు కేథరీన్ బ్రంట్, నటాలీ స్కివర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఐదేళ్లగా రిలేషన్ షిప్లో ఉన్న వీరిద్దరూ ఆదివారం (మే 29) పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. "వీకెండ్లో వివాహం చేసుకున్న కేథరీన్ బ్రంట్, నాట్ స్కివర్‌లకు మా హృదయపూర్వక అభినందనలు" అంటూ ఇంగ్లండ్ క్రికెట్ ట్విట్ చేసింది. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు, మాజీలు హాజరయ్యారు. ఇక 2017 మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో వీరిద్దరూ భాగమై ఉన్నారు. కాగా.. ప్రపంచ క్రికెట్లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం ఇదే తొలి సారి కాదు. గతంలో న్యూజిలాండ్ కు చెందిన అమీ సటర్త్‌వైట్, లియా తహుహు పెళ్లి చేసుకున్నారు. వీరితో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లు మా రిజాన్ కాప్, డేన్ వాన్ నీకెర్క్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్ కోచ్‌గా! Our warmest congratulations to Katherine Brunt & Nat Sciver who got married over the weekend ❤️ pic.twitter.com/8xgu7WxtFW — England Cricket (@englandcricket) May 30, 2022 -
విషాదం: గడ్డివాములో కుటుంబం అంతా ఆహుతి
సాక్షి, చెన్నై: హతమార్చి దహనం చేశారా..? లేదా బలవన్మరణానికి పాల్పడ్డారా..? కారణమేమైనా.. ఓ కుటుంబం గడ్డివాములో కడతేరిపోయింది. ముగ్గురి మృతదేహాలు ఆహుతి కావడం, మరొకరి మృతదేహం సగం కాలి ఉండడం మిస్టరీగా మారింది. శనివారం దిండుగల్ జిల్లా పళనిలో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. దిండుగల్ జిల్లా పళని సమీపంలోని వత్తగౌండం వలసకు చెందిన చిన్న రాజా అలియాస్ మురుగేషన్(52) రైతు. ఇతడికి పళని సంతలో దుకాణం కూడా ఉంది. ఆయనకు భార్య వలర్మతి(45), శివరంజని(21) కుమార్తె, కార్తికేయన్(18) కుమారుడు ఉన్నారు. చదవండి: తాలిబన్లకు మద్దతిచ్చిన 15 మంది అరెస్టు పిల్లలు ఇద్దరు పళని, ఒట్టన్‌చత్రంలోని కళాశాలల్లో బీఎడ్, బీకాం చదువుకుంటున్నారు. పంట పొలంలోనే చిన్న ఇల్లు కట్టుకుని ఈ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఉదయాన్నే ఆ ఇంటి ముందు ఉన్న గడ్డివాము, పక్క నే ఉన్న జొన్న పంట తగల బడుతుండటాన్ని సమీ పంలోని రైతులు గుర్తించారు. మురుగేషన్‌కు సమాచారం ఇచ్చేందుకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఆహుతైన స్థితిలో.. సమాచారం అందుకున్న ఆయకుడి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.అయితే, గడ్డివాములో సగంకాలిన స్థితిలో మురుగేషన్ మృత దేహం, పూర్తిగా కాలిన స్థితిలో మిగిలిన ముగ్గురి మృతదేహాలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. దిండుగల్ ఐజీ అన్భు, డీఐజీ విజయకుమార్, ఎస్పీ శ్రీనివాసన్, డీఎస్పీ శివకుమార్ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు, చిందర వందరగా వస్తువులు పడి ఉండడంతో ఇది హత్యగా అనుమానించారు. చదవండి: ప్రేమ పేరుతో వంచించి.. నగ్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. అయితే, అక్కడకు ఇతర వ్యక్తులు వచ్చి వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. మృతదేహాల్ని పోస్టుమార్టం చేయగా, నలుగురు విషం తాగి ఉన్నట్లు తేలడంతో ఈ కేసు పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. భార్య, పిల్లలకు విషం ఇచ్చి హతమార్చినానంతరం, గడ్డివాములో పడేసి మురుగేషన్ నిప్పు పెట్టి ఉండ వచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: 200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత చివరకు తాను ఆ విషం సేవించి మంటల్లో ఆహుతై ఉండ వచ్చని , అందుకే అతడి మృతదేహం సగమే కాలినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే, కుటుంబం అంతా బలన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ చేదింపునకు ఆయకుడి పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. -
'రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.ప్రస్తుతం రైతులు దయనీయ పరిస్థితులో ఉన్నారని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ.. అగ్ని ప్రమాద ఘటనలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభీత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు. దీంతో చంద్రబాబు సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మేం భూములు ఇచ్చేది లేదు: రైతులు
-
మేం భూములు ఇచ్చేది లేదు: రైతులు
గుంటూరు: తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు మరోసారి స్పష్టం చేశారు. రైతు పక్షపాతిని అని చెప్పుకున్న ప్రభుత్వం.. ఇవాళ ఏం చేస్తోందని వారు ప్రశ్నించారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభీత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వని వారిని లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. నిస్వార్ధంగా ఉన్న వారి ఆస్తులను తగులబెట్టారని రైతులు ఏకరువు పెట్టారు. రైతులను, ఆస్తులను తగులబెట్టి.. రైతుల ప్రాణాల మీద చంద్రబాబు రాజధాని కట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఒక్క ఉండవల్లి గ్రామంలోనే రూ. 4 లక్షల ఆస్తి నష్టం జరిగిందని వారు తెలిపారు. రైతు పక్షపాతిని అని చెప్పుకుంటున్న ప్రభుత్వం..ఇవాళ చోద్యం చూస్తోందన్నారు. భూములను ఇవ్వనన్న రైతులకు నష్టం చేయడం చాలా దారుణమని రైతులు కరాఖండిగా చెప్పారు. -
రాజధాని గ్రామాల ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో... దుండగుల దుశ్చర్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆయన సోమవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. పంటలు తగులబెట్టిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబు సందర్భంగా కలెక్టర్‌ను సూచించారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై సమీక్షించనున్నారు. కాగా రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న గ్రామాల్లో దుండగులు అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. గడ్డివాములు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు నిప్పు పెట్టారు. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.