England Women Cricketers Nat Sciver And Katherine Brunt Got Married, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Nat Sciver And Katherine Brunt: ఐదేళ్ల స్నేహం! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్లు

Published Mon, May 30 2022 9:31 PM | Last Updated on Tue, May 31 2022 11:22 AM

England women cricketers Nat Sciver and Katherine Brunt get married - Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ మహిళా క్రికెటర్లు కేథరీన్ బ్రంట్, నటాలీ స్కివర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఐదేళ్లగా రిలేషన్ షిప్‌లో ఉన్న వీరిద్దరూ ఆదివారం (మే 29) పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. "వీకెండ్‌లో వివాహం చేసుకున్న కేథరీన్ బ్రంట్, నాట్ స్కివర్‌లకు మా హృదయపూర్వక అభినందనలు" అంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ ట్విట్‌ చేసింది. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు పలువురు ఇంగ్లండ్‌ క్రికెటర్‌లు, మాజీలు హాజరయ్యారు.

ఇక 2017 మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టులో వీరిద్దరూ భాగమై ఉన్నారు. కాగా.. ప్రపంచ క్రికెట్‌లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం ఇదే తొలి సారి కాదు. గతంలో న్యూజిలాండ్ కు చెందిన అమీ సటర్త్‌వైట్, లియా తహుహు పెళ్లి చేసుకున్నారు. వీరితో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లు మా రిజాన్ కాప్, డేన్ వాన్ నీకెర్క్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్‌ కోచ్‌గా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement