
ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ నైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి హీథర్ నైట్ తప్పుకుంది.ఈ విషయాన్ని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. "ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్సీ పదవి నుంచి హీథర్ నైట్ వైదొలిగింది. 9 ఏళ్ల పాటు కెప్టెన్ సేవలు అందించినందుకు థాంక్యూ నైట్" అని ఈసీబీఎక్స్‌లో పేర్కొంది.
2016లో కెప్టెన్‌గా ఎంపికైన హీథర్ నైట్.. 199 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌ను ముందుండి నడిపించింది. ఆమె సారథ్యంలోనే 2017 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకుంది. అంతేకాకుండా ఇంగ్లండ్ జట్టును ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్‌కు కూడా నైట్ చేర్చింది.
కాగా ఇంగ్లండ్ మహిళల క్రికెట్ చరిత్రలో హీథర్ నైట్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. 199 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించిన నైట్.. 134 మ్యాచ్‌ల్లో తన జట్టుకు అద్బుతమైన విజయాలను అందించింది. ఆమె వరుసగా రికార్డు స్దాయిలో ఎనిమిది వన్డే సిరీస్‌లను ఇంగ్లండ్‌కు అందించింది.
అయితే ఇటీవల కాలంలో మాత్రం నైట్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూపు స్టేజిలోనే ఇంగ్లీష్ జట్టు ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌లో కూడా అదే తీరును ఇంగ్లండ్‌ను కనబరిచింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు పగ్గాల నుంచి ఆమె తప్పుకుంది. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్‌గా నాట్ స్కీవర్ బ్రంట్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.
చదవండి: IPL 2025: ఈసారి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలు వీరే!
Comments
Please login to add a commentAdd a comment