ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డుకెక్కింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన ఎక్లెస్టోన్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.
సోఫీ కేవలం 63 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మార్క్‌ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ పేరిట ఉండేంది. ఆమె 64 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో క్యాథరిన్ ఆల్‌టైమ్ రికార్డును ఎక్లెస్టోన్ బ్రేక్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై 178 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment