england women
-
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్నర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డుకెక్కింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన ఎక్లెస్టోన్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.సోఫీ కేవలం 63 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మార్క్‌ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ పేరిట ఉండేంది. ఆమె 64 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో క్యాథరిన్ ఆల్‌టైమ్ రికార్డును ఎక్లెస్టోన్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై 178 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారీ విజయం నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఈ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డు శ్రీలంక మహిళల జట్టు పేరిట ఉండేది. 1997లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 309 పరుగుల తేడాతో ఓడించింది. తాజా మ్యాచ్‌తో 26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్ మూడు , గైక్వాడ్ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్(21) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కూడా దీప్తి శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టంది. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన 9⃣.3⃣ - Sophia Dunkley 9⃣.4⃣ - Nat Sciver-Brunt Relive how Pooja Vastrakar 2⃣ wickets in an over 🎥 🔽 Follow the Match ▶️ https://t.co/UB89NFaqaJ #TeamIndia | #INDvENG | @Vastrakarp25 | @IDFCFIRSTBank pic.twitter.com/EAUF8WPwMF — BCCI Women (@BCCIWomen) December 16, 2023 -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. 347 పరుగుల తేడాతో భారీ విజయం
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు దీప్తీ శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్ చెలరేగడంతో మూడో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ చాపచుట్టేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్ మూడు , గైక్వాడ్ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్(21) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 186/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యాన్ని కలుపుకుని ఇంగ్లండ్ ముందు 479 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఉంచింది. అదే విధంగా ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. మొదటి ఇన్నింగ్స్‌లోనూ 136 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటైంది. భారత్ విషయానికి వస్తే.. తమ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం 428 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో శుభ సతీశ్ (76 బంతుల్లో 69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (99 బంతుల్లో 68; ), యస్తిక భాటియా (88 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (111 బంతుల్లో 67 ; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్(49) పరుగులతో రాణించింది. కాగా మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన -
అప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజల్.. ఇప్పుడు తన ప్రేయసితో ఎంగేజ్మెంట్!
ఇంగ్లండ్ మహిళా స్టార్ క్రికెటర్ డేనియల్ వ్యాట్ సంచలన ప్రకటన చేసింది. వ్యాట్.. తన ప్రేయసి, ఇంగ్లండ్ మహిళల ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ జార్జీ హెడ్గేతో నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా వ్యాట్ షేర్ చేసింది. దీనికి ‘మైన్ ఫరెవర్’ అంటూ వ్యాట్ క్యాప్షన్‌గా ఇచ్చింది. కాగా గత కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని 2020లో వ్యాట్ ప్రపంచానికి తెలియజేసింది. కాగా అంతకుముందు 2014లో వ్యాట్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి సోషల్ మీడియా ద్వారా మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ‘కోహ్లీ మ్యారీ మీ!!!’ అంటూ సరదాగా ఆమె ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌కు కోహ్లి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇంతకుముందు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ నటాలీ స్కివర్ కూడా తన సహాచర ప్లేయర్ కేథరీన్ బ్రంట్ స్వలింగ వివాహం చేసుకోగా.. మరో క్రికెటర్ లారెన్ విన్ఫీల్డ్-హిల్, కోర్ట్నీ హిల్‌ను ఈ విధంగానే వివాహం చేసుకుంది. అదే విధంగా న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు లీ తహుహు, అమీ సాటర్త్‌వైట్, దక్షిణాఫ్రికాకు చెందిన డేన్ వాన్ నీకెర్క్ , మారిజానే కాప్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మేగాన్ షుట్,జెస్ జోనాసెన్ కూడా స్వలింగ వివాహం చేసుకున్న వారే. చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం Mine forever 😍💍❤️ pic.twitter.com/cal3fyfsEs — Danielle Wyatt (@Danni_Wyatt) March 2, 2023 -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలో తొలి జట్టుగా!
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. టీ20 వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లీష్ జట్టు తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లే, ఓ సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌లు ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్, నిదా ధార్, హసన్ తలా వికెట్ సాధించారు. ఇక 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. చదవండి: IND vs AUS: దినేష్ కార్తీక్ ముందే పసిగట్టాడా? ఆసీస్ కుప్పకూలుతుందని.. A stunning performance with the bat! 💪 We become the first team to pass 200 at a Women's T20 World Cup! 🔥🔥🔥 Scorecard: https://t.co/TeqEjKWEy2#ENGvPAK | #T20WorldCup pic.twitter.com/9iDMegt112 — England Cricket (@englandcricket) February 21, 2023 -
ఇంగ్లండ్‌తో భారత్ కీలకపోరు.. గెలిస్తే సెమీస్‌కు!
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్ కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్–2లో భాగంగా తమ మూడో లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీని టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం గ్రూప్–2లో భారత్, ఇంగ్లండ్ తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి. ఇంగ్లండ్‌తో పోరులో నెగ్గాలంటే భారత అమ్మాయిలు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్, వెస్టిండీస్‌తో మ్యాచ్‌ల్లో విజయం సాధించే క్రమంలో ఒత్తిడికిలోనైన భారత్ ఈ మ్యాచ్‌లో తడబడితే మాత్రం ప్రతికూల ఫలితం వచ్చే అవకాశముంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే గ్రూపు-2 నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. చదవండి: Badminton Asia Mixed Team Championships 2023: తొలిసారి సెమీస్‌లో భారత్ -
రన్ఔట్ విషయం లో మమ్మల్ని హెచ్చరించలేదు : హీథర్ నైట్
-
భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం!
చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా భారత మహిళలతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ(29), స్మృతి మంధాన(23) పరుగులతో రాణించారు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్ల అంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్లెన్ నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా.. డేవిస్, స్మిత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ సోఫియా డంక్లీ 61 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మాత్రమే వికెట్ సాధించింది. చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
భారత్‌తో టీ20 సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్!
స్వదేశంలో భారత మహిళలతో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, స్టాండింగ్ కెప్టెన్ నాట్ స్కివర్ టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా దూరమైంది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా స్కివర్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా భారత్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైట్ స్థానంలో స్కివర్‌కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అప్పగించింది. తాజాగా స్కివర్ కూడా తప్పుకోవడంతో ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక స్కివర్ స్థానంలో ఇంగ్లీష్ జట్టుకు కెప్టెన్‌గా వికెట్ కీపర్ అమీ జోన్స్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా శనివారం జరగనున్న తొలి టీ20తో భారత్ టూర్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు: లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, ఫ్రెయా డేవిస్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అమీ జోన్స్ (కెప్టెన్), ఫ్రెయా కెంప్, బ్రయోనీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్ భారత జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, తనియా భాటియా(వికెట్ కీపర్), స్నేహ రాణా, రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్, సబ్బినేని మేఘనా, సబ్బినేని మేఘనా హేమలత, రిచా ఘోష్, సిమ్రాన్ బహదూర్, కిరణ్ నవ్‌గిరే చదవండి: Asia Cup 2022: 'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్ ఆజాం ఆగ్రహం -
కామన్వెల్త్ గేమ్స్‌లో ఓటమి.. ఇంగ్లండ్ హెడ్ కోచ్ సంచలన నిర్ణయం!
ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్ లీసా కీట్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇంగ్లండ్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన హెడ్‌కోచ్ పదవికి కీట్లీ రాజీనామా చేయాలని నిర్ణయించుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లీగ్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ అద్భుతంగా ఆడినప్పటికీ.. సెమీఫైనల్లో భారత్ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందింది. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన కాంస్య పతక పోరులోనూ ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. దీంతో స్వదేశంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పటికీ క్రికెట్ విభాగంలో పతకం సాధించకుండానే ఇంగ్లండ్ తమ ప్రయాణాన్ని ముగించింది. కాగా కీట్లీ రెండున్నరేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా పనిచేసింది. ఆమె నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా మహిళల ప్రపంచ కప్-2022లో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరడంలో ఆమె కీలక పాత్ర పోషిచింది. ఇక కీట్లీకు కోచ్‌గా సెప్టెంబర్‌లో జరగనున్న ఇంగ్లండ్- భారత్ సిరీస్ అఖరిది కానుంది. ఈ సిరీస్ తర్వాత ఆమె తన బాధ్యతలనుంచి తప్పుకోనుంది. చదవండి: భారత్‌పై చెత్త రికార్డుకు కారణం మా జట్టు అత్యుత్సాహమే: పాక్ క్రికెటర్ -
ఐదేళ్ల దోస్తానా! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు
ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్లు కేథరీన్ బ్రంట్, నటాలీ స్కివర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఐదేళ్లగా రిలేషన్ షిప్లో ఉన్న వీరిద్దరూ ఆదివారం (మే 29) పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. "వీకెండ్లో వివాహం చేసుకున్న కేథరీన్ బ్రంట్, నాట్ స్కివర్‌లకు మా హృదయపూర్వక అభినందనలు" అంటూ ఇంగ్లండ్ క్రికెట్ ట్విట్ చేసింది. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు, మాజీలు హాజరయ్యారు. ఇక 2017 మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో వీరిద్దరూ భాగమై ఉన్నారు. కాగా.. ప్రపంచ క్రికెట్లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం ఇదే తొలి సారి కాదు. గతంలో న్యూజిలాండ్ కు చెందిన అమీ సటర్త్‌వైట్, లియా తహుహు పెళ్లి చేసుకున్నారు. వీరితో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లు మా రిజాన్ కాప్, డేన్ వాన్ నీకెర్క్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్ కోచ్‌గా! Our warmest congratulations to Katherine Brunt & Nat Sciver who got married over the weekend ❤️ pic.twitter.com/8xgu7WxtFW — England Cricket (@englandcricket) May 30, 2022 -
పక్షిలా గాల్లోకి ఎగిరి.. సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫీల్డర్ డియాండ్రా డాటిన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన షామిలియా కన్నెల్ బౌలింగ్‌లో.. లారెన్ విన్ఫీల్డ్ హిల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడింది. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న డాటిన్ జంప్ చేస్తూ సింగిల్ హ్యండ్ క్యాచ్ అందుకుంది. దీంతో ఒక్క సారిగా బ్యాటర్‌తో పాటు, తోటి ఫీల్డర్లు షాక్‌కు గురయ్యారు. ఇక 16 పరుగులు చేసిన విన్ఫీల్డ్ నిరాశతో పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ప్రస్తుతం డాటిన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. విన్ఫీల్డ్ ఔటయ్యాక ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను విండీస్ మట్టికరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డియాండ్రా డాటిన్(31),హేలే మాథ్యూస్(45), కాంప్‌బెల్(66) పరుగులతో రాణించారు. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 218 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్(46), ఎక్లెటన్ (33), క్రాస్ (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022- RCB New Captain: అప్డేట్ ఇచ్చిన కోహ్లి.. వావ్ మళ్లీ భయ్యానే కెప్టెన్! Diving Deandra Dottin takes a screamer in West Indies' 7 run win over England at the World Cup.@abcsport #CWC22 #ENGvWI vision: Fox Sports pic.twitter.com/GFL4yctvtZ — Duncan Huntsdale (@duncs_h) March 9, 2022 -
దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం
ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ బెత్ మూనీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇంగ్లండ్‌తో యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో బెత్‌మూనీ డైవ్ చేసి బౌండరీని సేవ్ చేయడం వైరల్‌గా మారింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ప్రాక్టీస్ సెషన్లో బెత్‌మూనీ ఫీల్డింగ్ చేస్తూ జారిపడింది. వేగంగా పడడంతో ఆమె దవడ పగిలింది. ముఖమంతా రక్తమయమయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చదవండి: IPL 2022: సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి వైద్యులు ఆమె ముఖానికి మూడు మెటల్ప్లేట్స్ అమర్చి కుట్లు వేసి సర్జరీ చేశారు. దవడ బాగానికి బలంగా తాకడంతో గట్టి పదార్థాలు తినకూడదని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో బెత్‌మూనీ తన రోజూవారి ఆహరంలో సూప్, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లను కేవలం స్ట్రా ద్వారా మాత్రమే తీసుకుంది. దాదాపు పదిరోజుల పాటు బెత్‌మూనీ ఆహారం ఇదే. సరిగ్గా పదిరోజుల తర్వాత పడిలేచిన కెరటంలా బెత్‌మూనీ యాషెస్‌లో బరిలోకి దిగింది. రెండోరోజు ఆటలో బెత్‌మూనీ బౌండరీలైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని ఆపడం కెమెరాలకు చిక్కింది. గాయం నొప్పి ఇంకా ఉన్నప్పటికి ఏ మాత్రం లెక్కచేయకుండా జట్టుకోసం బరిలోకి దిగిన బెత్మూనీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బెత్ మూనీ దైర్యాన్ని తాము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని.. సర్జరీ జరిగిన కేవలం పదిరోజుల్లోనే తిరిగి క్రికెట్ ఆడిన బెత్‌మూనీ మాకు ఆదర్శప్రాయమని ఆ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వుమెన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కెప్టెన్ హెథర్ నైట్ 127 పరుగులు నాటౌట్, సోఫీ ఎసిల్స్టోన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. Playing with a broken jaw and Beth Mooney is still throwing herself around in the field 😳 #Ashes pic.twitter.com/hBjxOnVgtw — 7Cricket (@7Cricket) January 28, 2022 -
మ్యాచ్ పోయింది... క్యాచ్ అదిరింది!
నార్తాంప్టన్: వర్షం ఆటంకం కలిగించిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో భారత మహిళలపై గెలిచింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. సీవర్ (27 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), అమీ జోన్స్ (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. శిఖా పాండేకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కూడా వర్షం దోబూచులాడటంతో ఆట సరిగ్గా సాగనేలేదు. లక్ష్యఛేదనలో భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. షఫాలీ (0) డకౌట్ కాగా, స్మృతి మంధాన (29; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. హర్లీన్ (17 నాటౌట్), దీప్తి శర్మ (3 నాటౌట్) క్రీజులో ఉండగా మళ్లీ వర్షం వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో ఆటను ఆపేసి డక్‌వర్త్ పద్ధతిలో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటిం చారు. ఆటను నిలిపివేసే సమయానికి డక్‌వర్త్ పద్ధతిలో భారత్ గెలవాలంటే స్కోరు 73గా ఉండాల్సింది. సూపర్... సూపర్...ఉమన్ హర్లీన్ అబ్బాయిల క్రికెట్ ఎక్కడ... అమ్మాయిల క్రికెట్ ఎక్కడ! వారి మెరుపులు చుక్కలు... మరి వీరి మెరుపులు మామూలు సిక్సర్లు! అంటే సరిపోతుందేమో కానీ... పురుషుల ఫిట్నెస్ భళా అతివల ఫిట్నెస్ డీలా అంటే కుదరదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మనమ్మాయే... పేరు హర్లీన్ డియోల్. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఈమె తొలి టి20లో అసాధారణ క్యాచ్ పట్టింది. బహుశా మహిళల క్రికెట్లో ఇలాంటి క్యాచ్ ఇదే మొదటిది. అందుకనే ప్రత్యర్థి ఇంగ్లండ్ శిబిరం కూడా ఆమె క్యాచ్‌కు చప్పట్లు కొట్టింది. ఆనంద్ మహీంద్రాలాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఔరా అన్నారంటే అర్థం చేసుకోండి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో శిఖా పాండే 19వ ఓవర్ వేసింది. ఐదో బంతిని అమీ జోన్స్ భారీ షాట్ ఆడింది. బౌండరీ లైన్‌కు తాకెంత దగ్గర్లో హర్లీన్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంది. బౌండరీ అవతల పడిపోతానని తెలిసిన ఆమె బంతిని గాల్లో వదిలి లైన్ దాటింది. మళ్లీ అక్కడ్నుంచి బంతి నేలను తాకేలోపే మైదానంలోకి డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ అందుకుంది. -
ఖాట్మండుపై బాంబులు వేశారా..అన్నట్లే!
ఖాట్మండు: 'ఆ ఉదయం చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఖాట్మండు నుంచి నాంచీ బజార్ ఎవరెస్టు బేస్ క్యాంపుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను. ఒక పజీరో వాహనాన్ని అద్దెకు తీసుకొని నా సామాన్లు వగైరా విషయాలతో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో ప్రముఖ దరారా టవర్‌కు సమీపంలోని హోటల్ లో దిగిన నేను అక్కడి లాబీలో కూర్చుని ఉన్నాను. ఒక్కసారిగా కుర్చీలు వణకడం ప్రారంభమయ్యాయి. ఇంతలో ఎవరో భూకంపం భూకంపం అంటూ కేకలు వేశారు. టేబుల్‌ను గట్టిగా పట్టుకుని నన్ను కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నించాను. ఇంతలో అవి నా చేతిలో నుంచి జారిపోయి నేను కిందపడిపోయాను. హోటల్ లోని పెచ్చుళ్లు నా కాళ్లపై పడ్డాయి. నావి బలమైన షూ కావడంతో నాకు గాయాలవలేదు. కొద్ది సెకన్లలో తేరుకుని బయటకు పరుగెత్తాను. నా కళ్ల ముందు ఓ భయంకర అనుభవం. వర్ణించలేని విషాదం. వేలమంది ఇళ్ల కిటికీలోంచి, అంతస్తు పైనుంచి, ఎక్కడ నుంచి బడితే అక్కడి నుంచి భయంతో కిందికి దూకేస్తున్నారు. పెద్ద పెద్ద భవంతులు మొదలు నరికిన చెట్ల మాదిరిగా పడిపోతున్నాయి. వాహనాలు నియంత్రణ కోల్పోయి ఎటుపడితే అటు గుద్దుకుని తీవ్ర భీభత్సం సృష్టించాయి. కాసేపట్లోనే పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఒకరి సలహాతో దగ్గరలో ఉన్న ఓ మైదాన ప్రాంతానికి పరుగుతీసి నిల్చున్నాను. నాతోపాటు ఓ యూరోపియన్ టూరిస్టు వచ్చి నిల్చుని చెప్పాడు. అక్కడ ఉన్న భారీ టవర్ కూలిపోయి దానికింద వేలమంది పడిపోయారని. కాసేపట్లో వేలమందిమి ఒకే మైదాన ప్రాంతంలో పోగయ్యాం. మా వస్తువులు తెచ్చుకుందామని హోటల్‌కు వెళితే మరోసారి ప్రకంపనలు వచ్చాయి. దాంతో మేమంతా చనిపోతున్నామని ఏడ్వడం ప్రారంభించాం. కళ్లు మూసుకుని దేవుడిని ప్రార్థించి తెరిచి చూసేవరకు ఖాట్మండు అంతా బూడిదమయమైంది. ఓ భారీ బాంబును ఖాట్మండుపై వేశారా అన్నట్లుగా కనిపించింది. హాలీవుడ్ సినిమాలో కనిపించే భయంకర వాతావరణం అక్కడ కనిపించింది. ఏడుస్తున్నారు.. పరుగెత్తుతున్నారు.. కళ్ల వెంట ఆపుకోకుండా నీళ్లొస్తున్నాయి. అది నిజంగా ఒక మహా ప్రళయం' అంటూ ఇంగ్లాండుకు చెందిన సాహసి క్రిస్టినా బెర్రీ(25) నేపాల్ భూకంపానికి సంబంధించి తన అనుభవాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ ప్రయత్నం కూడా విఫలమవడంతో తిరిగి అక్కడే నిద్ర లేకుండా ఉండిపోయానని చెప్పింది.