Women's ODI World Cup 2022: West Indies Deandra Dottin Picks One-Handed Stunner Catch Against England - Sakshi
Sakshi News home page

WI vs ENG: పక్షిలా గాల్లోకి ఎగిరి.. సింగిల్‌ హ్యాండ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

Published Thu, Mar 10 2022 6:07 PM | Last Updated on Thu, Mar 10 2022 9:19 PM

Deandra Dottin picks one handed stunner against England in Womens World Cup - Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఫీల్డర్‌ డియాండ్రా డాటిన్ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 9 ఓవర్‌ వేసిన షామిలియా కన్నెల్ బౌలింగ్‌లో.. లారెన్ విన్‌ఫీల్డ్ హిల్ పాయింట్‌ దిశగా కట్‌ షాట్‌ ఆడింది. ఈ క్రమంలో పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న డాటిన్ జంప్‌ చేస్తూ సింగిల్‌ హ్యండ్‌ క్యాచ్‌ అందుకుంది. దీంతో ఒక్క సారిగా బ్యాటర్‌తో పాటు, తోటి ఫీల్డర్లు షాక్‌కు గురయ్యారు. ఇక 16 పరుగులు చేసిన విన్‌ఫీల్డ్ నిరాశతో పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ప్రస్తుతం డాటిన్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

 కాగా ఈ ఒక్క క్యాచ్‌తో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. విన్‌ఫీల్డ్ ఔటయ్యాక ఇంగ్లండ్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే  ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను విండీస్‌ మట్టికరిపించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బ్యాటర్లలో డియాండ్రా డాటిన్‌(31),హేలే మాథ్యూస్‌(45), కాంప్‌బెల్‌(66) పరుగులతో రాణించారు. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 218 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో టామీ బీమౌంట్‌(46),  ఎక్లెటన్ (33), క్రాస్ (27) టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

చదవండి: IPL 2022- RCB New Captain: అప్‌డేట్‌ ఇచ్చిన కోహ్లి.. వావ్‌ మళ్లీ భయ్యానే కెప్టెన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement