WI Vs NZ: Shimron Hetmyer Takes One Handed Stunning Catch - Sakshi
Sakshi News home page

WI vs NZ: హెట్‌మైర్‌ అద్భుత విన్యాసం‌.. క్యాచ్‌ ఆఫ్‌ది సీజన్‌!

Published Thu, Aug 11 2022 6:52 PM | Last Updated on Thu, Aug 11 2022 7:31 PM

Shimron Hetmyer Takes One Handed Stunning Catch - Sakshi

కింగ్‌స్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్‌ ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్‌ సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కళ్లు చెదిరే రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టి ప్రత్యర్థి బ్యాటర్‌ను షాక్‌కు గురిచేశాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన ఒడియన్‌ స్మిత్‌ బౌలింగ్‌లో మూడో బంతిని మార్టిన్‌ గుప్టిల్‌ భారీ షాట్‌ ఆడాడు.

అయితే అది సిక్స్‌ వెళ్తుందన్న క్రమంలో.. పాయింట్‌ దశలో ఫీల్డింగ్‌ చేస్తున్న హైట్‌మైర్‌ పరుగెత్తుకుంటూ సింగిల్‌ హ్యాండ్‌తో అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు విండీస్‌ వికెట్‌ కీపర్‌ డెవాన్‌ థామస్‌ కూడా అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. గుప్టిల్‌ ఔటైన తర్వాతి బంతికే కాన్వే ఇచ్చిన క్యాచ్‌ను థామస్‌ డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. కివీస్‌పై 13 పరుగుల తేడాతో విండీస్‌ పరాజాయం పాలైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. విలియమ్సన్(47),డెవాన్‌ కాన్వే(43) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో స్మిత్‌ మూడు వికెట్లు, హోల్డర్‌, మోకాయ్‌ తలా వికెట్‌ సాధించారు.

ఇక 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. కివీస్‌ బౌలర్లలో సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్‌, సౌథీ, సోధి తలా వికెట్‌ సాధించారు. కాగా విండీస్‌ బ్యాటర్లో ఓపెనర్ బ్రూక్స్‌ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలచాడు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 ఆగస్టు 13న జరగనుంది.


చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. ప్రాక్టీస్ షురూ చేసిన కింగ్‌ కోహ్లి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement