
టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన శాంట్నర్ బౌలింగ్‌లో.. స్టోయినిస్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అది మిస్ టైమ్ బంతి గాల్లోకి లేచింది.
ఈ క్రమంలో స్వీపర్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిఫ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో ఒక్క సారిగా స్టేడియంలో ఉన్న ఆటగాళ్లతో పాటు అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఫిలిప్స్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి దిశగా అడగులు వేస్తోంది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13 ఓవర్లు ముగిసే సరికి 86 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.
చదవండి: NZ Vs Aus: దుమ్ములేపిన కివీస్ ఓపెనర్లు.. వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ సేన రికార్డులు!