వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో పార్ట్ టైమ్ బౌలర్‌గా ఎటాక్‌లోకి వచ్చిన ఫిలిప్స్ తన స్పిన్ మయాజాలంతో ఆసీస్‌ను ముప్పుతిప్పులు పెట్టాడు. ఫిలిప్స్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్లెన్.. కేవలం 45 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు.
అందులో 4 మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఫిలిప్స్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన ఫిలిప్స్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత 15 ఏళ్లలో న్యూజిలాండ్ గడ్డపై 5 వికెట్ల ఘనత సాధించిన తొలి కివీ స్పిన్నర్‌గా ఫిలిప్స్ నిలిచాడు.
ఆఖరిగా 2008లో బ్లాక్ క్యాప్స్ స్పిన్నర్ జీతన్ పటేల్ 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది.
చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే
Comments
Please login to add a commentAdd a comment