లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ఓ అద్భుత విన్యాసం చేశాడు. ఈ మ్యాచ్ ఆరో ఓవర్‌లో కుశాల్ పెరీరా కొట్టిన భారీ షాట్‌ను ఫిలిప్స్ కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ పక్షిలా గాల్లోకి ఎగిరి గాల్లోనే బంతిని బౌండరీ రోప్ లోపలికి నెట్టాడు.
GLENN PHILLIPS IS NEXT LEVEL. 🤯
- Probably the greatest athlete from New Zealand. 🫡 pic.twitter.com/DIheKFMVCn— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024
ఫిలిప్స్ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఫిలిప్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ జరిగి ఐదు రోజులైనా నెట్టింట ఈ వీడియో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. క్రికెట్ చరిత్రలో ఇంతటి అద్భుత విన్యాసం ఎవరూ చేసి ఉండరని నెటిజన్లు జేజేలు పలుకున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. అద్భుతమైన క్యాచ్‌తో అబ్బురపరిచిన ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. అయినా ఈ మ్యాచ్‌లో అతను ప్రాతినిథ్యం వహించిన కొలొంబో టీమ్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. ఫిలిప్స్ (52), ఏంజెలో పెరారీ (41), గుర్బాజ్ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. కుశాల్ పెరీరా (80), రీజా హెండ్రిక్స్ (54) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీకరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment