క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యంకాని రీతిలో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్‌ను మాటల్లో వర్ణించలేని పరిస్థితి. గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ తన కుడివైపుకు గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నాడు. ఫిలిప్స్ ఈ క్యాచ్ పట్టాక న్యూజిలాండ్ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి.
Glenn Phillips takes an OUTRAGEOUS catch. The flying Bird.#INDvsENG #INDvENGpic.twitter.com/NsXe122tsm
— Abdullah Neaz (@Neaz__Abdullah) February 15, 2024
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ ఈ కళ్లు చెదిరే క్యాచ్‌కు వేదికైంది. మూడో రోజు ఆటలో కీగన్ పీటర్సన్ కొట్టిన షాట్‌ను ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు.
కాగా, పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్‌పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి.
స్కోర్ వివరాలు..
- సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 242 ఆలౌట్ (డి స్వార్డ్ట్ 64, విలియమ్ రూర్కీ 4/59)
- న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 211 ఆలౌట్ (విలియమ్సన్ 43, డి పైడ్ట్ 5/89)
- సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 235 ఆలౌట్ (బెడింగ్హమ్ 110, విలియమ్ రూర్కీ 5/34)
- న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 40/1 (టామ్ లాథమ్ 21 నాటౌట్, డి పైడ్ట్ 1/3)
న్యూజిలాండ్ గెలవాలంటే 227 పరుగులు చేయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment