Keegan Petersen
-
మాటల్లో వర్ణించలేని క్యాచ్.. మాయ చేసిన గ్లెన్ ఫిలిప్స్
క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యంకాని రీతిలో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్‌ను మాటల్లో వర్ణించలేని పరిస్థితి. గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ తన కుడివైపుకు గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నాడు. ఫిలిప్స్ ఈ క్యాచ్ పట్టాక న్యూజిలాండ్ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. Glenn Phillips takes an OUTRAGEOUS catch. The flying Bird.#INDvsENG #INDvENGpic.twitter.com/NsXe122tsm — Abdullah Neaz (@Neaz__Abdullah) February 15, 2024 రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ ఈ కళ్లు చెదిరే క్యాచ్‌కు వేదికైంది. మూడో రోజు ఆటలో కీగన్ పీటర్సన్ కొట్టిన షాట్‌ను ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. కాగా, పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్‌పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 242 ఆలౌట్ (డి స్వార్డ్ట్ 64, విలియమ్ రూర్కీ 4/59) న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 211 ఆలౌట్ (విలియమ్సన్ 43, డి పైడ్ట్ 5/89) సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 235 ఆలౌట్ (బెడింగ్హమ్ 110, విలియమ్ రూర్కీ 5/34) న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 40/1 (టామ్ లాథమ్ 21 నాటౌట్, డి పైడ్ట్ 1/3) న్యూజిలాండ్ గెలవాలంటే 227 పరుగులు చేయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. -
టీమిండియాపై దుమ్మురేపాడు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా
దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ జనవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పీటర్సన్ అద్భుత ప్రదర్శనకు గాను అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ సిరీస్‌లో పీటర్సన్ 244 పరుగులు చేశాడు. అంతే కాకుండా సిరీస్‌ను 2-1తో ప్రోటీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మరోవైపు, జనవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ ఎంపికైంది. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల యాషెస్ టెస్టులో నైట్ 216 పరుగులు చేసింది. తొ్లి ఇన్నింగ్స్‌లో 164 పరుగులు సాధించి ఇంగ్లండ్‌కు భారీ స్కోర్‌ను అందించింది. అయితే ఆస్ట్రేలియా కూడా పోరడడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చదవండి: IPL 2022 Auction-Tilak Varma: తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి -
టీమిండియాపై చెలరేగిన దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు కరోనా..
న్యూజిలాండ్ పర్యటనకు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చెలరేగి ఆడిన ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ కరోనా బారిన పడ్డాడు. దీంతో కివీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు అతను దూరమయ్యాడు. అతని స్థానంలో జుబేర్ హంజాను ఎంపిక చేసింది క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ). ప్రస్తుతం పీటర్సన్ క్వారంటైన్లో ఉన్నాడని, అతనిలో ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని సీఎస్ఏ తెలిపింది. కాగా, న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫిబ్రవరి 17న తొలి టెస్ట్, ఫిబ్రవరి 25 నుంచి రెండో టెస్ట్ జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకు క్రైస్ట్‌చర్చ్ వేదిక కానుంది. ఇదిలా ఉంటే, ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ప్రొటీస్ జట్టు 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 46 సగటున 276 పరుగులు చేసిన పీటర్సన్.. ఓ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్(ఆఖరి టెస్ట్) అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. చదవండి: కోహ్లిని ఖుషి చేయాలనుకుంటున్న బీసీసీఐ.. వందో టెస్ట్ కోసం భారీ ఏర్పాట్లు..! -
Ind Vs Sa: టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అదే.. అందుకే ఎనిమిదోసారి కూడా..
దక్షిణాఫ్రికా గడ్డపై మూడు దశాబ్దాల గెలుపు కల నెరవేరలేదు... ఎనిమిదో ప్రయత్నంలోనూ టీమిండియా సిరీస్ సాధించడంలో విఫలమైంది. పైగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న జట్టు ఆ తర్వాత అనూహ్యంగా రెండు పరాజయాలతో సిరీస్ ఓటమిని మూటగట్టుకుంది. గత కొన్నేళ్లుగా జట్టు అద్భుత ప్రదర్శనలు...ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో మన ఆట తీరు చూసిన తర్వాత బలహీనంగా కనిపిస్తున్న సఫారీ టీమ్‌ను ఓడించడం సులువనే సందేశంతో ఫేవరెట్‌గా కనిపించిన జట్టు చివరకు చేతులెత్తేసింది. బౌలర్లు అంచనాలకు తగిన రీతిలో సత్తా చాటినా... బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. అదే ఓటమికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మరో వైపు స్టార్లు ఎవరూ లేకపోయినా సమష్టి తత్వంతో సఫారీ టీమ్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. సెంచూరియన్‌లో ఓడినా కుంగిపోకుండా పైకి లేచిన సఫారీ బృందం పట్టుదల, పోరాటస్ఫూర్తితో భారత్‌కు షాక్ ఇచ్చింది. చేతిలో 8 వికెట్లతో 111 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆటలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 33.5 ఓవర్లలో ఆ పనిని పూర్తి చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకే వికెట్ తీయగలిగిన భారత బృందం చివరకు నిరాశతో సిరీస్‌ను ముగించింది. Ind Vs Sa 3rd test: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో 101/2 స్కోరుతో ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు 63.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కీగన్ పీటర్సన్ (113 బంతుల్లో 82; 10 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడగా...వాన్ డర్ డసెన్ (95 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు), తెంబా బవుమా (58 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 57 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. తాజా ఫలితంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకున్న సఫారీ టీమ్ ‘ఫ్రీడమ్ ట్రోఫీ’ని సగర్వంగా అందుకుంది. బౌలర్ల ఆధిపత్యం సాగిన సిరీస్‌లో 3 అర్ధ సెంచరీలతో 276 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ఇరు జట్ల మధ్య ఈ నెల 19నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. అలవోకగా లక్ష్యానికి... నాలుగో రోజు విజయాన్ని అందుకోవడంలో దక్షిణాఫ్రికాకు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. పీటర్సన్ బాధ్యత తీసుకొని ముందుండి నడిపించగా... వాన్ డర్ డసెన్, బవుమా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 65 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పీటర్సన్, ఆ తర్వాతా చక్కటి షాట్లు కొట్టాడు. 12 పరుగుల వద్ద డసెన్ క్యాచ్ అవుట్ కోసం అప్పీల్ చేసిన భారత్ ‘రివ్యూ’ కోరినా లాభం లేకపోయింది. ఆ తర్వాత 59 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో పుజారా వదిలేయడం కూడా సఫారీలకు కలిసొచ్చింది. ఎట్టకేలకు 54 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత శార్దుల్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని పీటర్సన్ నిష్క్రమించాడు. అయితే డసన్, బవుమా ఆ తర్వాత చక్కటి సమన్వయంతో ఆడుతూ మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 21 పరుగుల వద్ద శార్దుల్ బౌలింగ్‌లో డసెస్ ‘ఎల్బీ’ కోసం కూడా భారత్ రివ్యూ కోరినా...అంపైర్స్ కాల్‌తో బ్యాటర్ బతికిపోయాడు. లంచ్ సమయానికి స్కోరు 170 పరుగులకు చేరింది. విరామం తర్వాత భారత్ మరో వికెట్ తీయడంలో విఫలం కాగా, మిగిలిన 41 పరుగులు చేసేందుకు దక్షిణాఫ్రికాకు 8.3 ఓవర్లు సరిపోయాయి. అశ్విన్ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి బవుమా చేసిన విజయనాదంతో సిరీస్ సఫారీల సొంతమైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 210; భారత్ రెండో ఇన్నింగ్స్ 198; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) షమీ 16; ఎల్గర్ (సి) పంత్ (బి) బుమ్రా 30; పీటర్సన్ (బి) శార్దుల్ 82; వాన్ డర్ డసెన్ (నాటౌట్) 41; బవుమా (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (63.3 ఓవర్లలో 3 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–23, 2–101, 3–155. బౌలింగ్: బుమ్రా 17–5–54–1, షమీ 15–3–41–1, ఉమేశ్ 9–0–36–0, శార్దుల్ 11–3–22–1, అశ్విన్ 11.3–1–51–0. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం..! The #Proteas bowling attack producing when it matters most💚 🇿🇦 Day three highlights: https://t.co/SSbyoUVZSF#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/xEA1xSuuHj — Cricket South Africa (@OfficialCSA) January 14, 2022 Lungi Ngidi producing the goods with three game changing wickets✅ #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India | @JohnnieWalkerSA pic.twitter.com/BDoD3z25nT — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022 -
లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి
Pujara Drops Simple Catch Of Keegan Petersen: దక్షిణాఫ్రికా గడ్డపై తొట్టతొలి టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజేతులా జారవిడిచింది. నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్‌లో పేలవ ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్‌ను ప్రత్యర్ధికి వదులుకుంది. ప్రత్యర్ధికి 212 పరుగుల ఫైటింగ్ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయడం ద్వారా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. నాలుగో రోజు ఆట కీలక దశలో(126/2) కీగన్ పీటర్సన్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్‌ను పుజారా నేలపాలు చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్ బ్యాట్ అంచును ముద్దాడిన బంతి, నేరుగా పూజారా చేతుల్లో ల్యాండైంది. అయితే పూజారా వదిలేసాడు. ఇది చూసిన కోహ్లి మిన్నకుండిపోయాడు. కాగా, పుజారా.. పీటర్సన్ క్యాచ్ వదిలేసే సమయానికి దక్షిణాఫ్రికా.. విజయానికి ఇంకా 83 పరుగుల దూరంలో ఉండింది. పీటర్సన్ కీలక ఇన్నింగ్స్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) ఆడి టీమిండియాకు విజయాన్ని దూరం చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..? -
IND vs SA 3rd Test: టీమిండియాకు భంగపాటు.. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం
IND vs SA 3rd Test Day-4 Updates : టీమిండియాకు భంగపాటు.. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం 5:13 PM: దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉండగా దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సెట్ బ్యాటర్ కీగన్ పీటర్సన్(82) శార్ధూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 155 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో వాన్ డెర్ డస్సెన్(18), బవుమా ఉన్నారు. కీగన్ పీటర్సన్ అద్భుతంగా ఆడుతున్నాడు. 106 బంతుల్లో 74 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో డసెన్ అతడికి సహకారం అందిస్తున్నాడు. మరోవైపు టీమిండియా క్యాచ్‌లు జారవిడుస్తూ మ్యాచ్‌ను చేజార్చుకుంటోంది. స్కోరు: 148/2. విజయానికి 64 పరుగులు అవసరం. 2: 36 PM: షమీ బౌలింగ్‌లో 37వ ఓవర్ తొలి బంతికి డసెన్ షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమై క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌ను తాకినట్లు భావించిన కెప్టెన్ కోహ్లి ఆఖరి నిమిషంలో రివ్యూకు వెళ్లాడు. కానీ అక్కడ నిరాశే ఎదురైంది. దీంతో కోహ్లి మరోసారి అసహనానికి లోనయ్యాడు. 2: 30 PM: నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా కీగన్ పీటర్సన్ 53 పరుగులు, డసెన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకో 92 పరుగులు సాధిస్తే విజయం ఆతిథ్య జట్టు సొంతమవుతుంది. 2: 08 PM: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు నాలుగో రోజు ఆట ఆరంభమైంది. సిరీస్ విజయంపై కన్నేసిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు 101/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలెట్టింది. కీగన్ పీటర్సన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం డసెన్, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 106/2. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో కూడా పీటర్సన్ అర్ధ శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్: 223 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 198 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210 ఆలౌట్ తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. A well crafted half-century from Keegan Petersen🤝 Day two highlights: https://t.co/cm0Rg0OPio#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/izKdGUmSEn — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022