
IND vs SA 3rd Test Day-4 Updates :
టీమిండియాకు భంగపాటు.. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం
5:13 PM: దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉండగా దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సెట్ బ్యాటర్ కీగన్ పీటర్సన్(82) శార్ధూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 155 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో వాన్ డెర్ డస్సెన్(18), బవుమా ఉన్నారు.
కీగన్ పీటర్సన్ అద్భుతంగా ఆడుతున్నాడు. 106 బంతుల్లో 74 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో డసెన్ అతడికి సహకారం అందిస్తున్నాడు. మరోవైపు టీమిండియా క్యాచ్‌లు జారవిడుస్తూ మ్యాచ్‌ను చేజార్చుకుంటోంది. స్కోరు: 148/2. విజయానికి 64 పరుగులు అవసరం.
2: 36 PM: షమీ బౌలింగ్‌లో 37వ ఓవర్ తొలి బంతికి డసెన్ షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమై క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌ను తాకినట్లు భావించిన కెప్టెన్ కోహ్లి ఆఖరి నిమిషంలో రివ్యూకు వెళ్లాడు. కానీ అక్కడ నిరాశే ఎదురైంది. దీంతో కోహ్లి మరోసారి అసహనానికి లోనయ్యాడు.
2: 30 PM: నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా
కీగన్ పీటర్సన్ 53 పరుగులు, డసెన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకో 92 పరుగులు సాధిస్తే విజయం ఆతిథ్య జట్టు సొంతమవుతుంది.
2: 08 PM: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు నాలుగో రోజు ఆట ఆరంభమైంది. సిరీస్ విజయంపై కన్నేసిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు 101/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలెట్టింది. కీగన్ పీటర్సన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం డసెన్, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 106/2. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో కూడా పీటర్సన్ అర్ధ శతకంతో రాణించిన సంగతి తెలిసిందే.
భారత్ తొలి ఇన్నింగ్స్: 223 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్: 198 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210 ఆలౌట్
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్‌సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి.
A well crafted half-century from Keegan Petersen🤝
— Cricket South Africa (@OfficialCSA) January 13, 2022
Day two highlights: https://t.co/cm0Rg0OPio#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/izKdGUmSEn