చివరి మ్యాచ్‌ ఆడిన ఎల్గర్‌.. అభిమానుల మనసు గెలుచుకున్న కోహ్లి! | Virat Kohli Tells Crowd to Not Celebrate Elgars Wickets, Bows Down To South Africa Legend | Sakshi
Sakshi News home page

IND vs SA: చివరి మ్యాచ్‌ ఆడిన ఎల్గర్‌.. అభిమానుల మనసు గెలుచుకున్న కోహ్లి! వీడియో వైరల్‌

Published Thu, Jan 4 2024 11:10 AM | Last Updated on Thu, Jan 4 2024 12:11 PM

Virat Kohli Tells Crowd to Not Celebrate Elgars Wickets, Bows Down To South Africa Legend - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా స్టాండింగ్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌కు కోహ్లి ఘనమైన విడ్కోలు పలికాడు.

ఏం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు చివరిసారిగా ఎల్గర్‌ మైదానంలో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన ఎల్గర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 12 పరుగులే చేశాడు.  సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌ వేసిన ముఖేష్‌ కుమార్‌ బౌలింగ్‌లో రెండో బంతిని ఎల్గర్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే బంతి ఎడ్జ్‌తీసుకుని ఫస్ట్‌ స్లిప్‌ దిశగా వెళ్లింది. అక్కడ వున్న విరాట్‌ కోహ్లి ఈజీగా క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్‌ను పట్టిన వెంటనే కోహ్లి ఎటువంటి సెలబ్రేషన్స్‌ జరపుకోకుండా పరిగెత్తుకుంటూ ఎల్గర్‌ వద్దకు వెళ్లి అతడని అలింగనం చేసకున్నాడు. అంతేకాకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని డ్రెస్సింగ్ రూమ్‌తో  ప్రేక్షకులకు సూచించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.
చదవండి: Ind vs SA: అ‍స్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్‌’ సిరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement