
న్యూజిలాండ్ పర్యటనకు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చెలరేగి ఆడిన ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ కరోనా బారిన పడ్డాడు. దీంతో కివీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు అతను దూరమయ్యాడు.
అతని స్థానంలో జుబేర్ హంజాను ఎంపిక చేసింది క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ). ప్రస్తుతం పీటర్సన్ క్వారంటైన్‌లో ఉన్నాడని, అతనిలో ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని సీఎస్‌ఏ తెలిపింది. కాగా, న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫిబ్రవరి 17న తొలి టెస్ట్, ఫిబ్రవరి 25 నుంచి రెండో టెస్ట్ జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకు క్రైస్ట్‌చర్చ్ వేదిక కానుంది.
ఇదిలా ఉంటే, ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ప్రొటీస్ జట్టు 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 46 సగటున 276 పరుగులు చేసిన పీటర్సన్.. ఓ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్(ఆఖరి టెస్ట్) అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
చదవండి: కోహ్లిని ఖుషి చేయాలనుకుంటున్న బీసీసీఐ.. వందో టెస్ట్ కోసం భారీ ఏర్పాట్లు..!
Comments
Please login to add a commentAdd a comment