దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ జనవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పీటర్సన్ అద్భుత ప్రదర్శనకు గాను అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ సిరీస్‌లో పీటర్సన్ 244 పరుగులు చేశాడు. అంతే కాకుండా సిరీస్‌ను 2-1తో ప్రోటీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
అదే విధంగా అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మరోవైపు, జనవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ ఎంపికైంది. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల యాషెస్ టెస్టులో నైట్ 216 పరుగులు చేసింది. తొ్‌లి ఇన్నింగ్స్‌లో 164 పరుగులు సాధించి ఇంగ్లండ్‌కు భారీ స్కోర్‌ను అందించింది. అయితే ఆస్ట్రేలియా కూడా పోరడడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
చదవండి: IPL 2022 Auction-Tilak Varma: తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి
Comments
Please login to add a commentAdd a comment