టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు బావుమా, వండర్ డుస్సేన్ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అంతకు ముందు సెంచూరియన్‌లో 2013లో డికాక్, డివిలియర్స్ నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతే కాకుండా ఇది ఓవరాల్‌గా రెండో అత్యధిక భాగస్వామ్యం కూడా.
అంతకుముందు 2000లో కోచి వేదికగా తొలి వికెట్‌కు కిర్ట్‌సెన్ - గిబ్స్ 235 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు బావుమా(110), వండర్ డుస్సేన్(129) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు.
చదవండి: మ్యాక్స్‌వెల్ ఊచకోత .. 41 బంతుల్లో సెంచరీ.. ఏకంగా 24 ఫోర్లు, 4 సిక్స్‌లు!
Comments
Please login to add a commentAdd a comment