క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్యాచ్‌.. నమ్మశక్యం కాని రీతిలో..! | Best Catch In History, Glenn Phillips Grabs A Stunner To Dismiss Ollie Pope | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్యాచ్‌.. నమ్మశక్యం కాని రీతిలో..!

Published Fri, Nov 29 2024 10:39 AM | Last Updated on Fri, Nov 29 2024 11:02 AM

Best Catch In History, Glenn Phillips Grabs A Stunner To Dismiss Ollie Pope

క్రికెట్‌ చరిత్రలో అత్యంత అద్భుతమైన క్యాచ్‌కు న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ వేదికైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ నమ్మశక్యం కాని రీతిలో ఒంటిచేత్తో డైవింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ చూసి బ్యాటర్‌ ఓలీ పోప్‌ సహా ఫీల్డ్‌లో ఉన్న వారందరికి మతి పోయింది. ఫిలిప్స్‌ విన్యాసం చూసి నెటిజన్లు ముగ్దులైపోతున్నారు. ఇదేం క్యాచ్‌ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ 53వ ఓవర్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ టిమ్‌ సౌథీని బౌలింగ్‌కు దించాడు. అప్పటికే ఓలీ పోప్‌.. హ్యారీ బ్రూక్‌తో కలిసి ఐదో వికెట్‌కు 151 పరుగులు జోడించాడు. సౌథీ వేసిన షార్ట్‌ పిచ్‌ డెలివరీకి ఓలీ పోప్‌ కట్‌ షాట్‌ ఆడగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ అకస్మాత్తుగా ఫ్రేమ్‌లోకి వచ్చి అద్భుతమైన క్యాచ్‌ పట్టుకున్నాడు. ఫలితంగా పోప్‌ 77 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పెవిలియన్‌ బాట పట్టాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఓలీ పోప్‌ ఔటైన అనంతరం కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. బ్రూక్‌ 86 పరుగుల వద్ద బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌ స్కోర్‌ 232/5గా ఉంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే 0, బెన్‌ డకెట్‌ 46, జాకబ్‌ బేతెల్‌ 10, జో రూట్‌ 0, ఓలీ పోప్‌ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో నాథన్‌ స్మిత్‌ 2, టిమ్‌ సౌథీ, మ్యాట్‌ హెన్రీ, విలియమ్‌ ఓరూర్కీ తలో వికెట్‌ పడగొట్టారు.

అందకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్‌ విలియమ్సన్‌ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (58 నాటౌట్‌) బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి హాఫ్‌ సెంచరీ చేశాడు. టామ్‌ లాథమ్‌ (47), రచిన్‌ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌, షోయబ్‌ బషీర్‌ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement