క్రైస్ట్‌చర్చ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. బ్రూక్ తన కెరీర్‌లో ఏడో టెస్ట్ సెంచరీని 123 బంతుల్లో పూర్తి చేశాడు. బ్రూక్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకోవడం విశేషం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన బ్రూక్.. ఓలీ పోప్‌తో (77) కలిసి ఐదో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం జోడించాడు.
అనంతరం బ్రూక్.. బెన్ స్టోక్స్‌తో (32 నాటౌట్) కలిసి ఆరో వికెట్‌కు అజేయమైన 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం బ్రూక్ 126 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 309 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 39 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.
2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్రూక్
ఈ మ్యాచ్‌లో బ్రూక్ 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టెప్ట్‌ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. బ్రూక్ 2000 పరుగుల మార్కును తాకేందుకు 2300 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో బ్రూక్ సహచరుడు బెన్ డకెట్ టాప్‌లో ఉన్నాడు. డకెట్ 2293 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.
టెస్ట్‌ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితా..
బెన్ డకెట్-2293
హ్యారీ బ్రూక్-2300
టిమ్ సౌథీ-2418
అడమ్ గిల్‌క్రిస్ట్-2483
Comments
Please login to add a commentAdd a comment