న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ జోర్డన్ కాక్స్ కుడి చేతి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యింది. క్వీన్‌టౌన్‌లో జరుగుతున్న నెట్ సెషన్ సందర్భంగా కాక్స్ గాయపడ్డాడు. గాయం కారణంగా కాక్స్ న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కాక్స్‌కు రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించాల్సి ఉంది.
కాగా, క్రైస్ట్ చర్చ్ వేదికగా నవంబర్ 28 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌లో కాక్స్ అరంగేట్రం చేయాల్సి ఉండింది. అయితే ఈ లోపే అతను గాయపడి డెబ్యూ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాక్స్ జేమీ స్మిత్ స్థానంలో స్టాండ్ ఇన్ వికెట్‌కీపర్‌గా న్యూజిలాండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. జేమీ స్మిత్ ప్రస్తుతం పితృత్వ సెలవులో ఉన్నాడు.
ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ ఎలెవెన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. జోర్డన్ కాక్స్ ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో పాల్గొన్నాడు. ఆతర్వాత అతను గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చింది. తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (94), ఓలీ పోప్ (42).. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (82 నాటౌట్), బెన్ స్టోక్స్ (59) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగింది.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..
హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాకబ్ బేతెల్, రెహాన్ అహ్మద్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, ఓలీ పోప్ (వికెట్‌కీపర్), , షోయబ్ బషీర్, గస్ అట్కిన్సన్, ఓల్లీ స్టోన్, జాక్ లీచ్, మాథ్యూ పాట్స్
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు న్యూజిలాండ్ జట్టు..
గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్‌కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓ రూర్కీ, టిమ్ సౌథీ
షెడ్యూల్..
నవంబర్ 28-డిసెంబర్ 2 వరకు- తొలి టెస్ట్ (క్రైస్ట్ చర్చ్)
డిసెంబర్ 6-10 వరకు- రెండో టెస్ట్ (వెల్లింగ్టన్)
డిసెంబర్ 14-18 వరకు- మూడో టెస్ట్ (హ్యామిల్టన్)
Comments
Please login to add a commentAdd a comment