చెన్నై: టాస్ గెలిచి కూడా ఫీల్డింగ్ ఎంచుకొని చేసిన తప్పుడు వ్యూహంతో పాటు ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు వదిలేసిన వైఫల్యం చివరకు అఫ్గనిస్తాన్ భారీ ఓటమికి కారణంగా మారింది. తడబడుతూ ఇన్నింగ్స్ కొనసాగించి చివర్లో చెలరేగిన న్యూజిలాండ్, ఆపై బౌలింగ్‌లో సత్తా చాటగా...పేలవ బ్యాటింగ్‌లో అఫ్గన్ కుప్పకూలింది. దాంతో కివీస్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం చేరింది. బుధవారం జరిగిన పోరులో కివీస్ 149 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ ఫిలిప్స్ (80 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెపె్టన్ లాథమ్ (74 బంతుల్లో 68; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్ యంగ్ (64 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఆరంభంలో 109/1తో పటిష్టంగా ఉన్న కివీస్ పరుగు తేడాతో 3 వికెట్లు కోల్పోయి 110/4 వద్ద నిలిచింది. ఈ స్థితిలో లాథమ్, ఫిలిప్స్ ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయినా సరే టీమ్ ఒక దశలో 44 ఓవర్లలో 210 పరుగులే చేసింది.
కానీ చివరి 6 ఓవర్లలో బ్యాటర్లు చెలరేగడంతో ఏకంగా 78 పరుగులు సాధించగలిగింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. రహ్మత్ షా (62 బంతుల్లో 36; 1 ఫోర్) టాప్ స్కోరర్. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలనం రేపిన అఫ్గన్ గత వరల్డ్ కప్ రన్నరప్ ముందు అదే స్థాయి పోరాటపటిమ కనబర్చలేక చేతులెత్తేసింది.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 20; విల్ యంగ్ (సి) ఇక్రామ్ (బి) ఒమర్జాయ్ 54; రచిన్ (బి) ఒమర్జాయ్ 32; మిచెల్ (సి) ఇబ్రహీమ్ (బి) రషీద్ 1; లాథమ్ (బి) నవీనుల్ 68; ఫిలిప్స్ (సి) రషీద్‌ఖాన్ (బి) నవీనుల్ 71; చాప్‌మన్ నాటౌట్ 25; సాన్‌ట్నర్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 288.
వికెట్ల పతనం: 1–30, 2–109, 3–110, 4–110, 5–254, 6–255. బౌలింగ్: ముజీబ్ 10–0–57–1, ఫరూఖీ 7–1–39–0, నవీనుల్ 8–0–48–2, నబి 8–1–41–0, రషీద్ ఖాన్ 10–0–43–1, అజ్మతుల్లా ఒమర్జాయ్ 7–0–56–2.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) హెన్రీ 11; ఇబ్రహీమ్ (సి) సాన్‌ట్నర్ (బి) బౌల్ట్ 14, రహ్మత్ షా (సి) అండ్ (బి) రచిన్ 36; హష్మతుల్లా (సి) సాన్‌ట్నర్ (బి) ఫెర్గూసన్ 8; ఒమర్జాయ్ (సి) లాథమ్ (బి) బౌల్ట్ 27; ఇక్రామ్ నాటౌట్ 19; నబి (బి) సాన్‌ట్నర్ 7; రషీద్‌ఖాన్ (సి) మిచెల్ (బి) ఫెర్గూసన్ 8; ముజీబ్ (సి) యంగ్ (బి) ఫెర్గూసన్ 4; నవీనుల్ (సి) చాప్‌మన్ (బి) సాన్‌ట్నర్ 0; ఫరూఖీ (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (34.4 ఓవర్లలో ఆలౌట్) 139. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–43, 4–97, 5–107, 6–125, 7–134, 8–138, 9–139, 10–139.
బౌలింగ్: బౌల్ట్ 7–1–18–2, హెన్రీ 5–2–16–1, సాన్‌ట్నర్ 7.4–0–39–3, ఫెర్గూసన్ 7–1–19–3, ఫిలిప్స్ 3–0–13–0, రచిన్ రవీంద్ర 5–0–34–1.
Comments
Please login to add a commentAdd a comment