![Danielle Wyatts Engagement Announcement With Her Partner Is Pure Love - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/3/f3d37fa2-e11e-4994-9d2c-f66244966144.jpg.webp?itok=YjWzCsNJ)
ఇంగ్లండ్ మహిళా స్టార్ క్రికెటర్ డేనియల్ వ్యాట్ సంచలన ప్రకటన చేసింది. వ్యాట్.. తన ప్రేయసి, ఇంగ్లండ్ మహిళల ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ జార్జీ హెడ్గేతో నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా వ్యాట్ షేర్ చేసింది. దీనికి ‘మైన్ ఫరెవర్’ అంటూ వ్యాట్ క్యాప్షన్‌గా ఇచ్చింది. కాగా గత కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారు.
ఈ విషయాన్ని 2020లో వ్యాట్ ప్రపంచానికి తెలియజేసింది. కాగా అంతకుముందు 2014లో వ్యాట్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి సోషల్ మీడియా ద్వారా మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ‘కోహ్లీ మ్యారీ మీ!!!’ అంటూ సరదాగా ఆమె ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌కు కోహ్లి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఇంతకుముందు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ నటాలీ స్కివర్ కూడా తన సహాచర ప్లేయర్ కేథరీన్ బ్రంట్ స్వలింగ వివాహం చేసుకోగా.. మరో క్రికెటర్ లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, కోర్ట్నీ హిల్‌ను ఈ విధంగానే వివాహం చేసుకుంది. అదే విధంగా న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు లీ తహుహు, అమీ సాటర్త్‌వైట్, దక్షిణాఫ్రికాకు చెందిన డేన్ వాన్ నీకెర్క్ , మారిజానే కాప్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మేగాన్ షుట్,జెస్ జోనాసెన్ కూడా స్వలింగ వివాహం చేసుకున్న వారే.
చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం
Mine forever 😍💍❤️ pic.twitter.com/cal3fyfsEs
— Danielle Wyatt (@Danni_Wyatt) March 2, 2023
Comments
Please login to add a commentAdd a comment