![Danielle Wyatt congratulates virat kohli on marrying Anushka Sharma - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/12/kohli.jpg.webp?itok=YPBOJRhi)
లండన్: గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్ పెళ్లి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి ఆటకు ఫిదా అయిపోయిందో లేక ఇద్దరి కెరీర్ ఒకటే అనుకుందేమోగానీ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి మనోడ్ని పెళ్లి చేసుకుంటానంటూ సరదాగా ఓ ప్రతిపాదన చేసింది. దాదాపు మూడేళ్ల క్రితం'నన్ను పెళ్లి చేసుకుంటావా కోహ్లి' అని ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది డానియల్లి యాట్.
ఆపై 2014లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియెల్లికి కోహ్లి బ్యాట్‌ను కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాంతో మురిసిపోయిన యాట్.. ఇక ఆ బ్యాట్‌తోనే క్రికెట్ ఆడతానడంటూ పేర్కొంది. కాగా, విరాట్ కోహ్లి వివాహం అనుష్క శర్మతో జరిగి పోవడంతో డానియెల్లి యాట్ స్పందించింది. ఇక చేసేది లేక కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. పెళ్లితో ఒక్కటైన కొత్త జంట కోహ్లి-అనుష్కలకు అభినందలు తెలిపింది.
Congratulations @imVkohli & @AnushkaSharma
— Danielle Wyatt (@Danni_Wyatt) 11 December 2017
Comments
Please login to add a commentAdd a comment