ఇక కోహ్లి ఇచ్చిన బ్యాట్ తోనే.. | Post marriage proposal, Danielle Wyatt reveals Virat Kohli's 'big' present | Sakshi
Sakshi News home page

ఇక కోహ్లి ఇచ్చిన బ్యాట్ తోనే..

Published Mon, Sep 11 2017 3:45 PM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

ఇక కోహ్లి ఇచ్చిన బ్యాట్ తోనే..

ఇక కోహ్లి ఇచ్చిన బ్యాట్ తోనే..

లండన్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కు అభిమానులు సంఖ్య ఎక్కువే. అందులో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్‌ కూడా ఉన్నారు. గతంలో కోహ్లికి మ్యారేజ్ ప్రపోజ్ చేసిన మహిళా క్రికెటరే డానియెల్లి. 'కోహ్లి మేరీ మీ' అని సోషల్ మీడియా ద్వారా సందేశం పంపి అప్పట్లో వార్తల్లో నిలిచిన మహిళా క్రికెటరే డానియెల్లి.

అయితే ఆ మహిళా క్రికెటర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇందుకు కారణం ఆమెకు గతంలో విరాట్ బహుమతిగా ఇచ్చిన బ్యాటే కారణం. 2014లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియల్లికి విరాట్ బ్యాట్ ను కానుకగా ఇచ్చారు. కాగా, ఆ బ్యాట్ ను ఇంతవరకూ ఆమె వాడలేదట. ఈ మేరకు ట్విట్టర్ లో విరాట్ ప్రజెంట్ చేసిన బ్యాట్ ను పోస్ట్ చేసిన డానియల్లి.. త్వరలోనే ఆ బ్యాట్ తో సాధన చేస్తానని పేర్కొన్నారు.


‘ఈ వారం తిరిగి క్రికెట్ శిక్షణలో పాల్గొంటున్నాను. ఆ బ్యాట్ ను ఇక ఉపయోగించకుండా ఉండలేను. బ్యాట్ ను కానుకగా ఇచ్చిన కోహ్లికి థాంక్స్' అని డానియల్లీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇటీవల ఇంగ్లండ్ గెలిచిన మహిళా వరల్డ్ కప్ లో డానియల్లి సభ్యురాలు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ కు ఆమె సన్నద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement