కోహ్లి.. నన్ను పెళ్లి చేసుకో! | 'Kholi marry me!', Virat Kohli gets marriage proposal from English cricketer Danielle Wyatt on Twitter | Sakshi
Sakshi News home page

కోహ్లి.. నన్ను పెళ్లి చేసుకో!

Published Sun, Apr 6 2014 10:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

కోహ్లి.. నన్ను పెళ్లి చేసుకో!

కోహ్లి.. నన్ను పెళ్లి చేసుకో!

విరాట్ కోహ్లి ఆటకు ఫిదా అయిపోయిందో లేక ఇద్దరి కెరీర్ ఒకటే అనుకుందేమోగానీ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి వ్యాట్ మనోడ్ని పెళ్లి చేసుకుంటానంటూ సరదాగా ఓ ప్రతిపాదన చేసింది. శుక్రవారం సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన సంగతి తెలిసిందే.

అయితే మ్యాచ్‌ను చూసిన మత్తులో 22 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ‘కోహ్లి... నన్ను పెళ్లి చేసుకో’ అని ట్వీట్ చేసింది. దీన్ని చూసిన ఎవరో ఓ వ్యక్తి ఉన్నఫలంగా మన ఢిల్లీ బ్యాట్స్‌మన్ ఎఫైర్‌ను బయటపెట్టేశాడు. ‘ఇప్పటికే కోహ్లి... బాలీవుడ్ నటి అనుష్క శర్మను బుక్ చేసుకున్నాడుగా’ అంటూ ట్వీట్ చేశాడు. అంతే ఒక్కసారిగా వ్యాట్  ‘అతను ఇతను కాడేమో’ అంటూ సానుభూతితో కూడిన బాధను వ్యక్తం చేసింది. పాపం... కోహ్లిపై ఎన్ని ఆశలు పెట్టుకుందో ఏమో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement