అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025ను పాకిస్తాన్ ఓటమితో ఆరంభించింది. జోహోర్ బహ్రు వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 18.5 ఓవర్లలో కేవలం 66 పరుగులకే కుప్పకూలింది.
పాక్ బ్యాటర్లలో కెప్టెన్ కోమాల్ ఖాన్(12), అయాజ్(15), ఆసిన్(10) డబుల్ ఫిగర్ మార్క్ అందుకోగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో అము సురేంకుమా 3 వికెట్లతో సత్తాచాటగా.. ఒలివా బ్రిన్స్‌డన్, ఓనీల్, కోల్‌మన్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఊదిపడేసిన ఇంగ్లండ్..
అనంతరం 65 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 9.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కేటీ జోన్స్(20) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో మనహర్ జెబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆసిన్, ఫాతిమా ఖాన్ తలా వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం. జనవరి 18న ఐర్లాండ్‌తో జరగాల్సిన ఇంగ్లండ్ మొదటి మ్యాచ్ రద్దు అయింది. అదే విధంగా పాక్ మొదటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది.
కాగా దక్షిణాఫ్రికా అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 22న అమెరికాతో తలపడనుంది. పాకిస్తాన్ కూడా అదే రోజున ఐర్లాండ్ మహిళలతో ఆడనుంది. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీని అద్బుతమైన విజయంతో ఆరంభించింది.
ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు చెలరేగడంతో ప్రత్యర్ధి విండీస్ కేవలం 44 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 21న మలేషియాతో ఆడనుంది.
చదవండి: Ranji Trophy: ముంబై జట్టు ప్రకటన.. రోహిత్ శర్మకు చోటు! కెప్టెన్ ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment