అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారీ విజయం నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఈ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డు శ్రీలంక మహిళల జట్టు పేరిట ఉండేది.
1997లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 309 పరుగుల తేడాతో ఓడించింది. తాజా మ్యాచ్‌తో 26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్ మూడు , గైక్వాడ్ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్(21) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కూడా దీప్తి శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టంది.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన
9⃣.3⃣ - Sophia Dunkley
— BCCI Women (@BCCIWomen) December 16, 2023
9⃣.4⃣ - Nat Sciver-Brunt
Relive how Pooja Vastrakar 2⃣ wickets in an over 🎥 🔽
Follow the Match ▶️ https://t.co/UB89NFaqaJ #TeamIndia | #INDvENG | @Vastrakarp25 | @IDFCFIRSTBank pic.twitter.com/EAUF8WPwMF
Comments
Please login to add a commentAdd a comment